Saturday, April 20, 2024
- Advertisement -

లోన్ యాప్స్ పై పంజా విసిరిన ఈడీ !

- Advertisement -

ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో అవసరానికి మించిన అన్నీ పనులు ఒక్క మొబైల్ ద్వారానే జరిగిపోతున్నాయి. ఆన్లైన్ గ్రాసరి మొదలుకొని బ్యాంకింగ్ లోన్ వరకు బయటకు వెళ్లాల్సిన పని లేకుండా కేవలం మొబైల్ ద్వారానే పనులు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు ఒన్ పొందాలంటే పలు రకాల డాక్యుమెంట్స్ తీసుకొని బ్యాంకుల చుట్టూ తిరిగినప్పటికి పని జరిగేది కాదు. కానీ నేటి రోజుల్లో ఇన్స్టంట్ లోన్ యాప్స్ వచ్చిన తరువాత స్మార్ట్ ఫోన్ ఉపయోగించి క్షణాల్లో లోన్ పొందవచ్చు. దాంతో ఎంతో మంది ఈ ఇన్స్టంట్ మొబైల్ లోన్ యాప్స్ కు నగదు పొందుతున్నారు.

అయితే వ్యక్తి బలహీనతను ఆసరాగా చేసుకొని.. లోన్ ఇచ్చే సమయంలో జీరో వడ్డీ అని చెప్పి లోని ఇచ్చిన తరువాత అసలు కంటే వడ్డీనే ఎక్కువ పిండేస్తున్నారు. దాంతో మొబైల్ లోన్ యాప్స్ పై ఎంతోమంది పిర్యాదులు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దాంతో ఎప్పుడూలేని విధంగా ఈ మొబైల్ లోన్ యాప్స్ పై అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఆర్బీఐ రెండు గట్టిగానే దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో లోన్స్ ఇచ్చే ఆయా సంస్థలు అయిన పేటియం, క్యాష్ ఫ్రీ, రజర్ పే వంటి కొన్ని సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు నిర్వహించింది.

అయితే ఇన్స్టంట్ లోన్స్ ఇచ్చే ఆయా మొబైల్ యాప్స్ అన్నీ చైనాకు చెందినవి కావడం గమనార్హం. దాంతో చైనా వ్యక్తుల నియంత్రణలో పని చేస్తున్న ఈ లోన్ సంస్థల ఖాతాల నుంచి ఇప్పటికే 17 కోట్ల రూపాయలను ఈడి స్వాధీనం చేసుకుంది. ఈ నగదు సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇక ఈ లోన్ యాప్స్ నుంచి అప్పు తీసుకున్న వారిని కాపాడేందుకు.. ఆర్బీఐ కూడా కూడా చర్యలు చేపడుతోంది. కచ్చితంగా ఈ లోన్ యాప్స్ అన్నీ ఆర్బీఐ నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ చేపడుతున్న చర్యలతో ఇన్స్టంట్ లోన్స్ ఇచ్చి యాప్స్ కు ఊహించని దెబ్బ తగిలిందనే చెప్పవచ్చు.

Also Read
ఆసియా కప్ : సూపర్ ఫైట్.. ఇండియా, పాక్ ఎవరి బలం ఎంత ?

రష్యాకు వ్యతిరేకంగా భారత్.. అసలెందుకు ?

పోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు బ్యాడ్ న్యూస్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -