Tuesday, May 7, 2024
- Advertisement -

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కులపై ఉచ్చు.

- Advertisement -

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కులపై ఉచ్చు బిగుస్తొన్నట్టు కనపడుతుంది.  రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ అధికారులు  మంగళవారం సోదాలు నిర్వహించారు.

అర్హులకంటే అనర్హులకే ఇళ్లు మంజారు అయినట్లు అధికారులు గుర్తించారు. ఇళ్లను కట్టకుండానే బిల్లులు మంజూరు అయినట్లు గుర్తించటం జరిగింది. పెద్దేముల్ మండలం రేగొండిలో 291 కుటుంబాలకు గానూ 290 ఇళ్లు నిర్మించారని హౌసింగ్ అధికారులు చెబుతున్నా, వాస్తవం మాత్రం విరుద్ధంగా ఉందని  దీనిపై విచారణ చేస్తున్నామని సీఐడీ డీఎస్పీ తెలిపారు. అవకతవకలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆ విభాగం అధికారుల బృందం విచారణను వేగవంతం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -