Tuesday, April 30, 2024
- Advertisement -

కొబ్బరి బొండం..తప్పకుండా తాగాల్సిందే!

- Advertisement -

వేసవిలో బాడీని డీ హైడ్రేట్ కాకుండా కాపాడటంలో ప్రధాన పాత్ర పోషించేంది ప్రకృతి ప్రసాదించిన కొబ్బరి బొండమే. వేసవిలో శరీరాన్ని కూల్‌గా ఉంచడమే కాదు బరువు తగ్గడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది కొబ్బరి బొండం. ఇందులో విటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం మరియు సోడియం పుష్కలంగా ఉంటాయి.

తక్కువ కొవ్వు, చక్కెర మరియు కేలరీల కంటెంట్‌తో, కొబ్బరి నీరు… సోడా వంటి చక్కెర పానీయాలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. పొటాషియం మరియు ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉండటంతో కొబ్బరి నీరు జీవక్రియను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా కాలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి బొండాలను రెగ్యులర్‌గా తాగడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటు, కొబ్బరి నీరు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అతిగా తినాలనే కోరికను తగ్గిస్తుంది. కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మలబద్ధకాన్ని నివారించడానికి దోహదపడుతుంది. అందుకే కొబ్బరి నీళ్లను మీ దినచర్యలో చేర్చడం ద్వారా మెరుగైన జీవక్రియ, ఆకలి నియంత్రణలో ఉంచుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -