Friday, May 10, 2024
- Advertisement -

వైఎస్ షర్మిల కోసం కాంగ్రెస్ సహకారం..!

- Advertisement -

కాంగ్రెస్ అధిష్టానం పోకడలను నిరసిస్తూ జగన్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. తన తండ్రి మరణాంతరం తను చేపట్టిన ఓదార్పు యాత్రకు సోనియాగాంధీ పర్మిషన్ ఇవ్వకపోవడంతో.. జగన్ పార్టీ కన్నా ఓదార్పే మిన్న అంటూ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు.

తక్షణ కారణంలాగా జరిగిన కొన్ని ఘటనలు జగన్ సొంతంగా పార్టీ పెట్టుకునేలా చేశాయి. మరి ఇదంతా జరిగి దాదాపు ఐదేళ్లు గడుస్తున్నాయి. జగన్ పార్టీ పెట్టిన అనంతరం ఇప్పుడు ఏపీలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. మరి ఇప్పుడు విశేషం ఏమిటంటే… తెలంగాణలో జగన్ సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్రకు తమ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రకటించాడు.

ఈయన కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ తరపున క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తి ఇప్పుడు తన జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర మీద దృష్టి పె ట్టడం.. అది సక్సెస్ అయ్యేందుకు సహకారం అందిస్తుండటం ఆసక్తికరమైన విషయమే. అయితే ఇది జీవన్ రెడ్డి వ్యక్తిగతంగా చేస్తున్న పని అని తెలుస్తోంది. జగన్ సోదరి షర్మిల తమకు ఆడబిడ్డలాంటిది అని.. ఆమెకు సహకారం అందించడం తమ బాధ్యత అని జీవన్ రెడ్డి అంటున్నాడు. ఆయన స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. కరీంనగర్ జిల్లాలో జరిగే షర్మిల పరామర్శ యాత్రకు సహకారం ఉంటుందని ప్రకటించాడు.

మరి ఏ ఓదార్పు యాత్ర కోసం అయితే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడో.. అదే ఓదార్పు యాత్ర విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సహకారం అందిస్తానని ప్రకటించడం విశేషమే. అయితే ఇది పూర్తిగా జీవన్ రెడ్డి వ్యక్తిగతం అనుకోవాల్సి వస్తోంది. మరి ఇలా వ్యక్తిగతంగా నైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతకు జీవన్ రెడ్డి సహకారం అందిస్తే.. దాన్ని కాంగ్రెస్ అధిష్టానం సహిస్తుందా? ఆయనకు ఏమైనా షో కాజ్ నోటీసులు ఇస్తుందా?! వేచి చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -