Tuesday, April 30, 2024
- Advertisement -

ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి కరోనా పాజిటీవ్ ?

- Advertisement -

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 58 లక్షల 18 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 86,052 కేసులు నమోదు కాగా, 1141 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు కరోనా భారి పలువురు రాజకీయ నేతలు పడ్డ విషయం తెలిసిందే. ఇందులో పలువురు నేతలు సైతం కన్నుమూశారు.

తాజాగా ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. జలుబు, జ్వరం తగ్గకపోవడంతో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకోగా వైరస్ సోకినట్టు తేలింది. ఇటీవల ఆయన పలు కార్యక్రమాలకు హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో అస్వస్థతకు గురికావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. అయితే కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో ద్యుల సలహా మేరకు ఆయన హోం ఐసోలేషన్‌‌లోకి వెళ్లారు.

తిరుమల డిక్లరేషన్ వివాదంపై బీజేపీ ఆధ్వర్యంలో మొన్న నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన పలు కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. తనతోపాటు పాల్గొన్న నేతలు, ఇటీవల తనను కలిసినవారు, కార్యకర్తలు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -