Thursday, May 2, 2024
- Advertisement -

డ్రైవర్‌ లేని రైలు.. ఇక మెట్రోలో నో డ్రైవర్..!

- Advertisement -

దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్‌ లేని రైలును ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ ఢిల్లీ మెట్రోలో ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ కూడా హాజరయ్యారు.ఈ చోదకరహిత రైలును.. మాజెంటా లైన్‌లో జనక్‌పురి నుంచి బొటానికల్ గార్డెన్‌ వరకు 37 కిలోమీటర్ల మేర నడపనున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మజ్లిస్‌ పార్క్‌ నుంచి శివ్‌ విహార్‌ మధ్య 57 కిలోమీటర్లు పొడవునా డ్రైవర్‌ లేని మెట్రో సేవలు మొదలవుతాయని ఢిల్లీ మెట్రో వెల‌్లడించింది.

దీంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో పనిచేసే నేషనల్​ కామన్​ మొబిలిటీ కార్డు(ఎన్​సీఎంసీ)ను ప్రారంభించారు మోదీ. ఎయిర్​పోర్ట్​ ఎక్స్​ప్రెస్​ లైన్​లో భాగంగా న్యూ ఢిల్లీ నుంచి ద్వారకా సెక్టార్ ​21 వరకు ఉన్న 23 కి.మీ పరిధిలో ఇది పనిచేస్తుంది. ఢిల్లీ మెట్రోలోని పది కారిడార్లలో ఎన్​సీఎంసీ మొదటిసారిగా వినియోగంలోకి రానుంది. ‘వన్​ నేషన్​-వన్​ కార్డ్’ నినాదంలో భాగంగా దీనిని 2019 మార్చిలో మోదీ ప్రారంభించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -