Saturday, April 27, 2024
- Advertisement -

డబ్బు తీసుకుంటూ స్టింగ్ ఆపరేషన్ దొరికిన ఎమ్మెల్యేలు

- Advertisement -

కర్నాటకలో సంచలనం. అక్కడి నుంచి రాజ్యసభ ఎన్నికల్లో నోట్ల కట్టలు కలకలం రేపాయి. ఓ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో నలుగురు ఎమ్మెల్యేలు ఐదు కోట్ల రూపాయలు తీసుకుని ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు. వీరిలో ఇద్దరు జెడిఎస్, ఒకరు కెజిపి, మరొకరు స్వతంత్ర ఎమ్మెల్యే కావడం విశేషం.

జేడీఎస్‌కు చెందిన చాముండేశ్వరి ఎమ్మెల్యే జి.టి.దేవెగౌడ, బసవకల్యాణకు చెందిన మల్లికార్జున ఖూబా, కేజీపీకి చెందిన ఆళంద ఎ మ్మెల్యే బి.ఆర్‌.పాటిల్‌, కోలారుకు చెందిన ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే వరూ ్తరు ప్రకాష్‌ ఈ స్టింగ్‌లో దొరికిపోయారు. ఛానెల్ నిర్వహించిన ఈ స్టింగ్ ఆపరేషన్ దొరికిన తర్వాత స్వతంత్ర ఎమ్మెల్యే ప్రకాష్ మాట్లాడుతూ ఇదంతా జెడిఎస్ చేసిన కుట్రలో భాగమేనని అన్నారు.

ఈ సంఘటనతో కర్నాటకలో మూడు నెలల పాటు రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ స్టింగ్ ఆపరేషన్ పై కేంద్ర ఎన్నిక కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -