Friday, May 3, 2024
- Advertisement -

రాజ‌ధానిపేరుతో జ‌రిగిన కుంభ‌కోణాలు ఐవైఆర్ రాసె పుస్త‌కంతో బ‌య‌ట‌కు వ‌స్తాయా…..?

- Advertisement -
Ex-CS IYR Krishna Rao to make a book of revelations about Amaravati

ఏపీ రాజ‌కీయాల‌లో బ్రాహ్మ‌ణ‌కార్పొరేష‌న్ ఛైర్మెన్ ఐవైఆర్ తొల‌గింపు రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. దీంతో సీఎం చంద్ర‌బాబు గుండెల్లో అల‌జ‌డి మొద‌ల‌య్యింది. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మానంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లు అన్ని ఐవైఆర్‌కు తెలుసు కాబ‌ట్టి …అవ‌న్నీ బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని టీడీపీ భ‌య‌ప‌డుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నిజాలు చేరడం లేదు. ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన అవసరం ఉంది. రాజధానిపై చాలా అంశాలు ఉన్నాయి. అవి ప్రజలకు తెలియాల్సి ఉంది. అన్ని అంశాలను పుస్తకంగా రాస్తా’’ అని ఐవైఆర్‌ కృష్ణారావు స్పష్టం చేశారు.

{loadmodule mod_custom,GA1}

రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత న‌వ్యాంధ్ర రాజ‌ధానినితుళ్లూరు ప్రాంతంలోనిర్మించాలని చంద్రబాబు గట్టిగా తీర్మానించుకున్నారు. తుళ్లూరులో రాజధాని నిర్మించడం ఐవైఆర్‌కు ఇష్టంలేదు. దానికి కారణం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం తుళ్లూరు ప్రాంతం రాజధానికి అనువైనది కాదు. దొనకొండ అనువైనది. ఐవైఆర్ అభిప్రాయం కూడా అదే. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు తప్ప చంద్రబాబును వ్యతిరేకించలేదు.ప్ర‌తి ప‌క్షాలు కూడా ఇదే విష‌యాన్ని చెప్పినా బాబు పెడ‌చెవిన పెట్టారు.
రాజధానికి భూముల సేకరణ విషయంలో చంద్రబాబు అడ్డగోలు నిర్ణయాలకు, స్విస్‌ ఛాలెంజ్‌ విధానాలకు, చట్ట విరుద్ధమైన నిర్ణయాలకు ఐవైఆర్‌ అంగీకారం తెలపలేదు. చీఫ్‌ సెక్రెటరీగా అలాంటి నిర్ణయాలలో భాగం పంచుకోలేదు. అలాంటి ఫైళ్లమీద సంతకాలు పెట్టలేదు.ప్రభుత్వ అవకతవకలన్నీ ఆయనకు తెలుసుకాబట్టి, ఆయనమీద ప్రేమ లేకపోయినా ఆయనతో మంచి సంబంధాలు కలిగి ఉండడం కోసం ఆయనకు ఇన్ఫర్‌మేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ (సుప్రీం కోర్ట్‌ జడ్జితో సమానస్థాయి) పోస్టు ఇవ్వజూపాడు.కాని ఆయ‌న బ్రాహ్మ‌న కార్పొరేష‌న్ ఛైర్మెన్ ప‌ద‌విని తీసుకున్నారు.

{loadmodule mod_custom,GA2}

ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సోషియ‌ల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టాడ‌ని ఆయ‌న్ని బ్రాహ్మ‌ణ‌కార్పొరేష‌న్ ఛైర్మెన్ ప‌ద‌వినుంచి తొల‌గించారు.అమ‌రావ‌తి భూముల విష‌యంలో త్వ‌ర‌లోనే ఒక పుస్త‌కం రాస్తాన‌ని ఐవైఆర్ ప్ర‌క‌టించారు.దీంతో టీడీపీగుండెల్లో రైల్లు ప‌రిగెడుతున్నాయి. పార్టీ అధినేత‌నుంచి …నాయ‌కుల వ‌ర‌కు ఎక్క‌డ త‌మ బండారాలు బ‌య‌ట‌కు వ‌స్తాయోన‌ని బెంబెలెత్తిపోతున్నారు.ఈవిధంగా నైనా ప్ర‌జ‌ల‌కు నిజాలు తెలిస్తే మంచిది.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}qPGy3isOI34{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -