Monday, April 29, 2024
- Advertisement -

ప్రాధాన్య‌త సంత‌రించుకున్న మోదీ ఇజ్రాయిల్ ప‌ర్య‌ట‌న‌.. భారీగా ఆయుధాల కొనుగోలు ఒప్పందాలు..

- Advertisement -
First Indian PM Narendra Modi Visited Israel

భార‌త్‌,చైనాల మ‌ధ్య యుద్ధ‌మేఘాలు క‌మ్ముకున్నాయి.క‌య్యానికి సై అంటె సై అంటున్నాయి. అయిన దానికి కాని దానికి తగాదాలకు దిగుతూ, కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ దేశం చైనాకు ధీటుగా జవాబిచ్చేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది.

చైనాకు చెమట్లు పట్టించే ఆయుధాలను కొనుగోలు చేసేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. అందుకే ఇప్పుడు మోదీ ఇజ్రాయిల్ ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

{loadmodule mod_custom,GA1}

ఇజ్రాయెల్ అంటేనే ఆధునిక టెక్నాలజీకి పెట్టింది పేరు. ముఖ్యంగా ఆయుధాలను తయారు చేయడంలో ఇజ్రాయెల్ ది ఓ చరిత్ర. మన దేశం రష్యా తర్వాత ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్నది ఇజ్రాయెల్ నుంచే. మనం ఇప్పటిదాకా కొనుగోలు చేసిన వాటిలో క్షిపణులు, డ్రోన్లు, వివిధ రకాల ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి.
ఇప్పటికే పలు దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకున్న ప్రధాని మోదీ ఇజ్రాయెల్ లో అడుగుపెట్టబోతున్నారు. మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలకడానికి ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు వేచి చూస్తున్నారు. వీరిద్దరి భేటీలో రక్షణ ఒప్పందాలే కీలకం కానున్నాయి. చైనా దూకుడు నేపథ్యంలో, ఇజ్రాయెల్ నుంచి 250 బిలియన్ డాలర్ల వ్యయంతో పెద్ద ఎత్తున క్షిపణులను కొనుగోలు చేసే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయనున్నాయి.

{loadmodule mod_custom,GA2}

ఇప్పటికే స్పైక్, బరాక్-8 క్షిపణుల కొనుగోలుకు ఆమోదం లభించింది. ఈ క్షిపణులన్నీ మన అమ్ములపొదిలోకి చేరితే, చైనా మరింత ఇరకాటంలో పడటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏప్ర‌ధానికూడా ఇజ్రాయిల్ ప‌ర్య‌ట‌న చేయ‌లేదు. మొద‌టి సారిగా మోదీ చ‌రిత్ర సృష్టించ‌బోతున్నారు.ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నెలకొని 25 ఏళ్లవుతున్న ప్రత్యేక సమయంలో ఇజ్రాయెల్‌లో పర్యట‌న సంత‌రించుకుంది.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}wWnpSsaZ5-I{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -