Monday, May 6, 2024
- Advertisement -

ర‌ఘురామ్‌రాజ‌న్‌కు రాజ్య‌స‌భ‌సీటును ఆఫ‌ర్ చేస్తున్న ఆమ్ఆద్మీపార్టీ…

- Advertisement -

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్ కూడా రాజ‌కీయాల్లో వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనె ఆయ‌న రాజ్య‌స‌భ‌కు వెల్ల‌నున్న‌ట్లు వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. కు రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రాజ్యసభ సీటు ఆఫర్‌ చేయబోతుంది. రాజ్యసభ సభ్యుడిగా రాజన్‌ను పేరును ఆప్‌ పరిశీలిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2015 ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్‌ 66 సీట్లు గెలుపొందింది. దీంతో దిల్లీ వాటాలో ఆమ్‌ ఆద్మీకి మూడు రాజ్యసభ సీట్లు వచ్చాయి. ఈ సీట్లు 2018 జనవరికి ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్‌ సభ్యుల ఎంపిక ప్రారంభించింది. అయితే పార్టీ నేతలకు కాకుండా బయటి వ్యక్తులు, ప్రముఖ నిపుణులకు ఈ సీట్లు ఇచ్చేందుకు ఆ పార్టీ నిర్ణయించింది.

సెంట్రల్‌ బ్యాంకుకు గవర్నర్‌గా పనిచేసిన రాజన్‌, ప్రస్తుతం చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రెండోసారి ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్‌ కొనసాగింపును పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, ఆయన పదవిని పొడిగించలేదు. ఖాలీ అవుతున్న మూడు రాజ్య‌స‌భ‌సీట్ల‌లో ఒక‌టి ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌కు సీటు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రాజన్‌ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -