Saturday, April 27, 2024
- Advertisement -

ధైర్యంగా పోరాడింది.. పాపం కరోనా కాటుకు బలైంది..

- Advertisement -

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా కొనసాగుతోంది. చిన్నపెద్దా తేడాలేకుండా చాలా మంది కరోనా కారణంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారు. నిత్యం అనేకమందిని కబళిస్తూ ప్రజలను తీవ్రభయాందోళనలకు గురిచేస్తోంది. ధైర్యంగా ఉన్నవాళ్లను సైతం మృత్యువుకు బలిచేస్తోంది. అయితే కరోనా వచ్చినా కొంత మంది ధైర్యంతో దాంతో పోరాడుతున్నారు.. జయిస్తున్నారు. మరికొంత మంది ఈ మహమ్మారికి బలి అవుతున్నారు.

ఈ మద్య సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యంది. ఎమర్జెన్సీ వార్డులో కరోనాకు చికిత్స పొందుతూ, ముక్కుకు ఆక్సిజన్ పైపు, చేతికి సెలైన్ తో ఉన్న ఓ యువతి ఎంతో ఉల్లాసంగా ‘లవ్ యూ జిందగీ’ సినిమాలోని పాట వింటూ హాయ్ చెబుతూ తానే కాదు పక్కవారికి కూడా ధైర్యాన్ని నింపింది. మహమ్మారిబారిన పడినా కూడా ఎంతో ధైర్యంగా, దాని నుంచి బయటపడతాననే నమ్మకం ఆమె ముఖంలో కనిపించడం పలువురిలో స్ఫూర్తిని నింపింది.

తాజాగా ఆ యువతి కరోనాతో పోరాడుతూ మరణించినట్లు డాక్టర్‌ మోనికా లాంగే ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘దురదృష్టవశాత్తు ఓ ధైర్యవంతురాలిని కోల్పోయాం. పరిస్థితులు మన చేతుల్లో లేవని, ఆ ధైర్యశాలి కోసం అందరం ప్రార్థిద్దాం అని పిలుపునిచ్చారు. కానీ ఎవ్వరి ప్రార్థనలు ఫలించలేదు… ఆ యువతి కరోనాపై పోరాటంలో ఓడిపోయింది… గురువారం తుదిశ్వాస విడిచింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’’ అంటూ డాక్టర్‌ లాంగే గురువారం ట్వీట్‌ చేశారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -