కేసీఆర్ పై ఫైర్ అయిన కేంద్ర మంత్రి

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. హుజూరాబాద్‌లో ఓడిన అధికార పార్టీ, ఆ ఓటమి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తుందన్నారు. అందుకోసమే కేసీఆర్ కేంద్రంపై ఆరోపణలు చేయడం ప్రారంభించారన్నారు. తాము రైస్ తీసుకుంటామని చెప్పినా కేసీఆర్ రాష్ట్రంలో అబద్దాలతో ప్రలోబాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా భయ్యారం ఫ్యాక్టరీని కేసిఆర్ పూర్తి చేస్తామన్నారని, అది ఇప్పుడు ఏమెందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టునే నిర్మించిన కేసీఆర్.. దానికే గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక్క పథకం మొదలు పెట్టలేదన్నారు.

- Advertisement -

కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచ్చిత బియ్యం ఇచ్చిందని, వాటితో పాటు శనగలు ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం ఇచ్చిన శనగలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రానున్న సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ వ్యూహం ఫలించిందా ?

కొవిడ్ కొత్త వేరియంట్‌.. మహారాష్ట్ర అలర్ట్

చంద్రబాబును నడిపిస్తున్న పికే..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -