Saturday, April 27, 2024
- Advertisement -

నెయ్యితో బరువు తగ్గవచ్చు!

- Advertisement -

అనాతి కాలం నుండి సూపర్ ఫుడ్‌గా వస్తున్న దానిలో నెయ్యిది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా ఆయుర్వేద నిపుణులు మనం తీసుకునే ఆహారంలో తొలి ముద్ద నెయ్యితో తినాలని చెబుతుంటారు. ఇక ఇప్పటికి ఆయుర్వేద నిపుణులు ప్రతిరోజు ఆహారంలో నెయ్యి తినాలని చెబుతుంటారు.వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి కలుపుకొని తింటే ఆ రుచి వర్ణనాతీతం.. అయితే నెయ్యి అధికంటే తింటే బరువు పెరుగుతారని ప్రచారంలో ఉండటంతో చాలామంది నెయ్యి తినడం మానేశారు. అయితే నెయ్యితో బరువు తగ్గవచ్చని తెలుస్తోంది.

ప్రతీరోజు డైట్‌లో ఒక చెంచా నెయ్యి తీసుకుంటే బరువు తగ్గవచ్చు. నెయ్యి ఔషధంగా పనిచేస్తుంది. చాలా మంది బరువు తగ్గే క్రమంలో ఆహారంలో కొవ్వు ఉండే పదార్థాలను ముట్టుకోరు. దీనివల్ల మేలు కంటే ఎక్కువ కీడే జరుగుతుంది. అయితే ఫ్రై చేసిన ఆహారం, బర్గర్‌లు మరియు ప్రాసెస్ చేసిన జంక్‌ ఫుడ్‌లు కాకుండా మంచి కొవ్వు ఉండే ఆహార్ని తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.

నెయ్యిలో విటమిన్ ఏ, కే, ఇ, మరియు కే వంటివి అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి ఉపయోగకరమైనవే. ఉదయాన్నే నెయ్యి తినడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. వేడి నెయ్యిలో షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది థర్మోజెనిసిస్‌ను ప్రేరేపిస్తుంది. ఈ ప్రక్రియ శరీరంలో వేడిని సృష్టించి కేలరీలను బర్న్ చేస్తుంది. కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. పసుపు పాలలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోయి చర్మంలోని మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -