Sunday, April 28, 2024
- Advertisement -

రైతుల‌కు ఓ వార్త‌.. ఈసారి సాధార‌ణ వ‌ర్షపాత‌మే..

- Advertisement -

రైతు క‌డుపు ఎప్పుడూ నిండుతుందంటే వ‌ర్షాకాలమంతా వ‌ర్షాలు ప‌డి త‌మ పంట‌పొలాల‌ను వ‌రుణుడు త‌డిపితే రెండు ముద్దలు నోట్లోకి వెళ్తాయి. రెండు పంట‌లు వేయాలంటే వ‌ర్షాలు రైతులకు చాలా ముఖ్యం. అలాంటి వ‌ర్షం నిరాశ‌కు గురిచేస్తే మాత్రం రైతు ఉరికొయ్య‌కు వేలాడే దౌర్భాగ్య‌పు ప‌రిస్థితి దేశ‌వ్యాప్తంగా ఉంటుంది. అయితే ఈ యేడు అలాంటి దౌర్భాగ్య ప‌రిస్థితి ఉండేలా క‌నిపించ‌డం లేదు. రైతు ఆనందంగా ఉండేలా క‌నిపిస్తోంది.

ఎందుకంటే ఈ వ‌ర్షాకాలం వ‌ర్షాలు రైతుల‌ను ముంచెత్తుతుంద‌ని స్కైమెట్ అనే సంస్థ ప్ర‌క‌టించింది. ఇది రైతుల‌కు శుభవార్తనే. ఈ ఏడాది సాధారణ వర్షపాతం న‌మోదవుతుంద‌ని వెల్ల‌డించింది. సాధార‌ణ వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. ఎల్‌నినో ప్రభావం కూడా ఉండదని స్కైమెట్ స్పష్టం చేయ‌డంతో రైతులు ఆనందంలో మునిగే స‌మ‌యం ఇది.

స్కైమెట్ అంచనాల ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో 55 శాతం సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల సాధారణం కంటే 20 శాతం అధిక వర్షపాతం కురిసేట‌ట్టు ఉంది. తెలంగాణలో సాధారణ స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సగటున 887 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అవుతుందని వెల్ల‌డించింది.

96 నుంచి 104 శాతం మేర వర్షాలు కురిస్తే సగటు వర్షపాతం
90 శాతానికి తగ్గితే వ‌ర్ష‌పాత లోటుగా చెబుతారు.
104-110 శాతం దాటితే అధిక వర్షపాతం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -