Wednesday, May 8, 2024
- Advertisement -

కొత్త మీడియా హౌస్‌ : ఎవరు పెడుతున్నారు.. ఎందుకు పెడుతున్నారు

- Advertisement -

విజయవాడ కేంద్రంగా కొందరు రెడ్డి పారిశ్రామిక, వ్యాపార వేత్త సుమారు రూ. 200 కోట్ల రూపాయ పెట్టుబడితో ఒక మీడియా హౌస్‌ నెలకొల్పే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ మీడియా హౌస్‌లో భాగంగా తొలుత న్యూస్‌ ఛానల్‌, తర్వాత దిన పత్రికను ఆరు నెల్లో ప్రారంభించానుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రదారిగా వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ బహిషృత నేత పి.గౌతంరెడ్డి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రా, తెంగాణా, రాయసీమల్లో స్ధిరపడిన పది మంది రెడ్డి సామాజిక పారిశ్రామిక, వ్యాపార వేత్తు ఒక్కోక్కరు రూ. 20 కోట్ల చొప్పున పెట్టుబడి పెట్టబోతున్నట్లు తెలిసింది.

వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి ప్రాభల్యం కొంత మేర తగ్గింది. రాష్ట్రం విడిపోవడం, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని కమ్మ ప్రాభల్యం ఎక్కువగా ఉన్న కృష్ణా ` గుంటూరు జిల్లా మధ్య ఏర్పాటు చేయడంతో ఆ సామాజిక రాజకీయ ప్రాభ్యం మరింత క్షీణించింది. వారు జగన్‌పై ఆశు పెట్టుకున్నప్పటికి ఆయన వ్యవహార శైలితో రెడ్డి పారిశ్రామిక, వ్యాపార వేత్తు ఆయనకు దగ్గర కాలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి తొగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తమ అస్ధిత్వానికి భగం కగడం ఖాయమని, దీనికి తోడు ఇప్పుడు ప్రజాధరణ పొందిన మీడియా అంతా కమ్మ సామాజిక వర్గం చేతిలోనే ఉండడం కూడా మంచిది కాదనే అభిప్రాయంతో ఈ వ్యాపార , పారిశ్రామిక వేత్తు ఉన్నట్లు తెలిసింది. తమ సామాజిక ప్రభుత్వం అధికారంలో లేకపోయినా శక్తివంతమైన మీడియా ఉంటే కొంతవరకూ తమ ఉనికిని కాపాడు కోవచ్చునని నారు భావిస్తున్నట్లు తెలిసింది. ప్రతిపాధిత మీడియా హౌస్‌లో తాము ఒకొక్కరు పెట్టబోతున్న రూ.20 కోట్లు తమకు ఎక్కువేమీ కాదన్న భావనతో ఉన్న వారు భనష్టాతో నిమిత్తం లేకుండా టీ.వి.ఛానల్‌, న్యూస్‌పేపర్‌ నడపానుకుంటున్నారు. అయితే ఈ నిర్వహణా మొత్తాన్ని విజయవాడలో ఎప్పటి నుంచో స్ధిరపడిన గౌతం రెడ్డికి అప్పగించారు. ఆయనకు పాయకాపురంలో ఉన్న సుమారు రెండెకరా ఖాళీ స్ధంలో త్వరలోనే కార్యాయా నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిసింది. గౌతంరెడ్డి రాజకీయాల్లో ఉంటూనే అనేక ప్రాంతాల్లో కేబుల్‌ టి.వి. కూడ నిర్వహిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -