Tuesday, April 30, 2024
- Advertisement -

భానుడి భగభగ..ఈ జాగ్రత్తలు తప్పనిసరి

- Advertisement -

ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంట్లో ఉన్న సరే జాగ్రత్తలు తీసుకోవడం కంపల్సరీ. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు నమోదవుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

వీలైనంత వరకు బాడీని డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. దాహం వేయకపోయినా, వీలైనంత వరకు నీరు త్రాగండి. నిమ్మరసం ఎంత ఎక్కువ సేవిస్తే అంత మంచిది. పండ్లు ఎక్కువగా తీసుకోండి. ప్రయాణంలో వాటర్ బాటిల్‌ని తీసుకెళ్లడం మర్చిపోవొద్దు.

సన్నని వదులుగా ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేదా చప్పల్స్ ధరించండి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి.పగటిపూట కిటికీలు మరియు కర్టెన్లను మూసి ఉంచండి. చిన్న పిల్లలు, గర్బిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 12:00 నుండి 03:00 గంటల మధ్య ఎండలో బయటకు రాకుండా ఉండండి.

చెప్పులు లేకుండా బయటకు వెళ్లవద్దు.వేడి ఎక్కువగా ఉండే సమయాల్లో వంట చేయడం మానుకోండి. ఆల్కహాల్, టీ, కాఫీ మరియు కార్బోనేటేడ్ శీతల పానీయాలు ,చక్కెరతో కూడిన పానీయాలను తీసుకోకపోవడమే మంచిది. అధిక మాంసకృత్తులు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -