Monday, April 29, 2024
- Advertisement -

హైబీపీ..నిర్లక్ష్యం చేస్తే అంతే!

- Advertisement -

హైబీపీ..ఇప్పుడు సర్వసాధారణమైన సమస్య. గుండె జబ్బులతో మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది హైబీపీతోనే ఉన్నారు. మైకం కమ్మడం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి హైబీపీ లక్షణాలు. వీటిని మనం గమనించగలిగితే హైబీపీ నుండి బయటపడవచ్చు. తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా హైబీపీ నుండి బయటపడవచ్చు.

అయితే రీసెంట్‌గా నిర్వహించిన సర్వేల్లో హైబీపీనే మరణానికి ప్రధాన కారణమని తేలింది. అధిక రక్తపోటు ధమనులను దెబ్బతీయడం ద్వారా హృదయ సంబంధ వ్యాధులకు దోహదం చేస్తుంది. గుండెకు రక్తం మరియు ఆక్సిజన్ ప్రవాహాన్ని తగ్గించి, మెదడులోని ధమనులు పగిలిపోవడానికి కారణమవుతుంది. ఇక ఈ సర్వేలో తేలిన షాకింగ్ విషయం ఏంటంటే..25-49 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులలో ఈ సమస్య ఎక్కువగా ఉందని వెల్లడించారు.

కాలక్రమేణ వస్తున్న ఆహారపు అలవాట్లు, ఇతర సమస్యలు హైబీపీ రావడానికి ప్రధాన కారణం. ఇందుకోసం బరువును కంట్రోల్‌లో ఉంచుకోవాలి. మద్యపానం,ధూమపానం మానేయడం, టైంకు నిద్రపోవడం, ఉప్పు అధికంగా తీసుకోకపోవడం మంచింది. హైబీపీని తగ్గించడంలో యాపిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తినే ఆహారంలో ఎక్కువ శాతం తాజా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలలో బీపీని అదుపులో ఉంచే గుణాలు ఉంటాయి. కాబట్టి బెండకాయ, బంగాళదుంప, వంకాయ, క్యాబేజీ, బీట్ రూట్, క్యారెట్.. వంటివి ఆహార డైట్ లో తప్పనిసరి చేర్చుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -