Monday, April 29, 2024
- Advertisement -

మ్యానిప్యులేటెడ్ లిస్ట్ లో భారత్ తో పాటు అమెరికా..!

- Advertisement -

కరెన్సీ అవకతవకల(మ్యానిప్యులేటెడ్) దేశాల పరిశీలన జాబితాలో భారత్​తో పాటు తైవాన్, థాయ్​లాండ్ దేశాలను చేర్చింది అమెరికా. వియత్నాం, స్విట్జర్లాండ్​ దేశాలను సైతం ఇదే జాబితాలో చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. చైనాతో పాటు జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఇటలీ, సింగపూర్, మలేసియా దేశాలు ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో నుంచి ఐర్లాండ్​ను తొలగించినట్లు అమెరికా ట్రెజరీ శాఖ తెలిపింది.

జూన్ 2020 వరకు నాలుగు త్రైమాసికాలలో తమ ప్రధాన వాణిజ్య భాగస్వాములైన వియత్నాం, స్విట్జర్లాండ్, భారత్, సింగపూర్​ దేశాలు.. విదేశీ మారక మార్కెట్లో విరుద్ధ ప్రమాణాలు పాటించాయని పేర్కొంది అమెరికా. వియత్నాం, స్విట్జర్లాండ్ దేశాలు.. తాము ఏర్పాటు చేసిన రెండు ప్రమాణాలను అధిగమించాయని తెలిపింది. ఈ పరిణామాల వల్ల అమెరికా ఆర్థిక వృద్ధితో పాటు దేశంలోని సంస్థలు, కార్మికులకు హాని కలుగుతుందని పేర్కొంది. ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -