Friday, May 3, 2024
- Advertisement -

భార‌త్ ,చైనా మ‌ధ్య కొన‌సాగుతున్న ఉద్రిక్త‌త‌లు… మ‌రిన్ని బ‌ల‌గాల త‌ర‌లింపు..

- Advertisement -
Indian Army send more troops in Doka La in longest impasse since 1962

సిక్కిం సరిహద్దులో భార‌త్ ,చైనాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.అవి ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. చైనాతో వివాదం నేపథ్యంలో భారత ఆర్మీ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి స‌న్న‌ధ్దంగా ఉన్నామ‌ని ఆర్మీఛీప్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఎటువంటి ప‌రిస్థితిని ఎదుర్కొవడానికి భారత్ మరిన్ని బలగాలను మోహరిస్తోంది. యుద్ధ పద్ధతిలో కాకుండా బలగాలను తరలిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ భారత్-చైనా సైనికులు ఎదురెదురుగా (స్టాండ్ ఆఫ్) నిల్చుని ఎవరూ ఎటూ కదలకుండా అప్రమత్తంగా ఉన్నారు. 1962 తర్వాత ఇదే అత్యంత సుదీర్ఘ స్టాండ్ ఆఫ్.
ప్రస్తుతం సిక్కిం రీజియన్‌లోని భారత్, చైనా, భూటాన్ సరిహద్దులో ఉన్న డోకాలాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ పెద్ద ఎత్తున బలగాలను తరలిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. 1962 యద్ధం తర్వాత భారత్ ఈ స్థాయిలో బలగాలను తరలించడం ఇదే తొలిసారి. అయితే గన్ నాజిల్‌ను కిందికి ఉంచడం ద్వారా తాము యుద్ధానికి రావడం లేదన్న సంకేతాలను భారత్ ఆర్మీ పంపింది.

{loadmodule mod_custom,GA1}

2012లో ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు బంకర్లను తొలగించాలని జూన్1న చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత్‌ను కోరింది. అందుకు భారత్ నిరాకరించింది. దీంతో ఆ ప్రాంతం తమదేనని, భారత్‌కు కానీ, భూటాన్‌కు కానీ దానిపై హక్కులు లేవంటూ జూన్ 6న బుల్డోజర్లతో భారత్ బంకర్లను ధ్వంసం చేసింది. దీంతో చైనా ఆగడాలను అడ్డుకునేందుకు ఇండియన్ ఆర్మీ రంగ ప్రవేశం చేసింది. సైనికులను మోహరించింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు నెల రోజులుగా అక్కడ స్టాండాఫ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్ పెద్ద ఎత్తున బలగాలను తరలించడం చర్చనీయాంశమైంది.

{loadmodule mod_custom,GA1}

Also read

  1. మాట‌కు మాట చైనాకు అరుణ్ జైట్లీ హెచ్చరిక..
  2. స‌రిహ‌ద్దుల్లో డ్రాగ‌న్ దుస్సాహ‌సం..
  3. ఆర్మీఛీప్ సిక్కింప‌ర్య‌ట‌న‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…
  4. 30 సంవ‌త్సరాల త‌ర్వాత మొద‌టి సారిగా భార‌త్ ఆర్మీలోకి శతఘ్నులు…

{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}tLBEekSsPFo{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -