Friday, May 3, 2024
- Advertisement -

త్వ‌ర‌లో ఐఆర్‌సీటీసీ పేరు మారుతోంది…కొత్త పేరు ఏదంటే…?

- Advertisement -

కోట్లాదిమంది భారతీయులు తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు ఉపకరిస్తున్న ‘‘ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్’’( ఐఆర్‌సీటీసీ) ఇక మీదట కనిపించదట. దాని స్థానంలో మ‌రో కొత్త పేరుతో వెబ్‌సైట్ రానుంది. ఐఆర్‌సీటీసీ కంటే మరింత ఆకట్టుకునే, సులువైన పేరు కోసం చూస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు.

ఐఆర్‌సీటీసీ అనే పేరును గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉందని.. అంతకంటే సులువైన పేరును వెతుకుతున్నామని.. కాచీగా.. ఆకర్షణీయంగా.. జనానికి తెలికగా గుర్తుండేలా కొత్త పేరు ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన రైల్వేశాఖను ఆదేశించారు.

రైల్వే శాఖ అపుడే కసరత్తు మొదలుపెట్టింది. ‘రైల్‌ ట్రావెల్‌’ అయితే బావుంటుందని రైల్వే అధికారి సూచించారట అయితే కొత్త పేరుపై తుది నిర్ణయం ఎపుడు తీసుకుంటారు, ఎప్పటినుంచి అమల్లోకి రానుంది అనేది స్పష్టత లేదు. రైల్వే శాఖ తుది జాబితా అందించిన తరువాత పేరును ఫైనల్‌ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

పండుగ సీజన్ నేపథ్యంలో రైలు టికెట్లపై ఐఆర్‌సీటీసీ 10 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను ఇటీవల ప్రకటించింది. ‘మొబీక్విక్’ చెల్లింపుల ద్వారా రైలు టికెట్ బుక్ చేసినప్పుడు 10 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు. అలాగే, పేటీఎం కూడా తమ గేట్‌వే ద్వారా టికెట్ బుక్ చేసుకునే వినియోగదారులకు రూ.100 వరకు క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే కూడా రూ.100 క్యాష్‌బ్యాక్ ఇస్తుంది. దీనితోపాటు మొదటి రెండు ట్రాన్సాక్షన్లకు రూ.50 రాయితీ అందిచనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -