Friday, May 10, 2024
- Advertisement -

అక్టోబర్ లో తెలంగాణ అసెంబ్లీ రద్దు..డిస్సెంబ‌ర్‌లో ఎన్నిక‌ల పండ‌గ‌…

- Advertisement -

తెలంగాణాలో టీఆర్ఎస్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెల్లేందుకు సిద్దం అయ్యింది. సెప్టెంబ‌ర్ చివ‌రివారంలో లేదా అక్టోబ‌ర్ మొద‌టి వారంలో అసెంబ్లీనీ ర‌ద్దు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.ఆపై ఈ సంవత్సరం నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ తొలి వారంలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణాభ‌వ‌న్‌లో జ‌రిగిన రాష్ట్ర‌కార్య‌వ‌ర్గ స‌మావేశంలో కేసీఆర్ నాయ‌కుల‌తో చ‌ర్చించారు. ఎన్నిక‌ల‌కు సిద్దంగా ఉండాలి పిలుపునిచ్చారు. కార్య‌వ‌ర్గ స‌మావేశం అనంత‌రం మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను విశ్లేషించిన తరువాత, ముందుగానే ఎన్నికలు జరిపితే తమకు అభ్యంతరం లేదని కేసీఆర్ సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ముంద‌స్తు ఎన్నిల‌కు వెల్లే సంకేతంగా సెప్టెంబ‌ర్‌లో అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని కేసీఆర్ తెలిపారు. దీనికితోడు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్, ప్రధానితో సమావేశమైన వేళ, ఈ సంవత్సరంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిపించాలన్న ప్రస్తావన వచ్చినట్టు వార్తలు వెలువడ్డాయి. ఒకే దేశం – ఒకే ఎన్నిక’ సాధ్యం కాని పక్షంలో, తాము కనీసం నాలుగు నెలల ముందుగా ఎన్నికలకు వెళతామని ఆయన ప్రధానికి తేల్చి చెప్పినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇప్పటికే అసెంబ్లీ రద్దుకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న కేసీఆర్, సీనియర్ మంత్రులతోనూ చర్చించినట్టు తెలుస్తోంది. కాగా, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో తెలంగాణ అసెంబ్లీ రద్దయితే, సంవత్సరం చివరిలో జరగాల్సిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు అభ్యంతరం లేదని ఈసీ కూడా వెల్లడించినట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -