Tuesday, May 7, 2024
- Advertisement -

5వ‌తేదీ సోమ‌వారం నింగిలోకి దూసుకెల్ల‌నున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–డీ

- Advertisement -
ISRO abuzz over heavy-lift rocket launch on June 5

భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్షయానానికి బాటలు వేసే ఇస్రో బాహుబలి రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌(జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–డీ1)ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 640 టన్నుల జీఎస్‌ఎల్వీ-మార్క్‌3 ద్వారా 3,136 కిలోల జీశాట్‌-19 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది.

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం సాయంత్రం 5.28 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.ప్రయోగంపై శుక్రవారం సాయంత్రం షార్‌లో మిషన రెడీనెస్‌ రివ్యూ నిర్వహించారు. ఎంఆర్‌ఆర్‌ చైర్మన డాక్టర్‌ బిఎన సురేష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం జీఎ్‌సఎల్వీ-మార్క్‌3 ప్రయోగానికి ఎటువంటి ఇబ్బందులు లేవని తేల్చింది. అనంతరం షార్‌ డైరెక్టర్‌ కున్హికృష్ణన అధ్యక్షతన జరిగిన లాంచ ఆథరైజేషన బోర్డు (ఎల్‌ఏబీ) సమావేశంలో ప్రయోగానికి ఆమోదం తెలిపారు.
ఇస్రో సుమారు 18 ఏళ్లు శ్రమించి రూపొందించిన ఈ జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–డీ1 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 3,136 కిలోల బరువు కలిగిన జీశాట్‌–19ను రోదసిలోకి పంపనున్నారు.భవిష్యత్‌లో మానవ సహిత ప్రయోగాలు నిర్వహించేందుకు జీఎస్‌ఎల్‌వీమార్క్‌3–డీ1 లాంటి భారీ ఉపగ్రహ వాహక నౌకను రూపొందించింది. దీనిద్వారా 5వేల కిలోల బరువు కలిగిన ఉపగ్రహాల్ని సైతం షార్‌ నుంచి పంపించుకునే వెసులుబాటు కలుగుతుంది.

{loadmodule mod_custom,GA1}

ఈ ప్ర‌యేగంలో43.43 మీటర్లు ఎత్తు కలిగిన జీఎస్‌ఎల్‌వీ–మార్క్‌3–డీ1 ప్రయోగం 16.20 నిమిషాల్లో పూర్తి కానుంది. మూడుదశల్లో ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తారు. దీనిద్వారా జీశాట్‌–19 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కి.మీ. ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహం రోదసిలో పదేళ్లపాటు సేవలందిస్తుంది.
ఆదివారం మధ్యాహ్నం 3.58 గంటలకు కౌంట్‌డౌనను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కౌంట్‌డౌన ముగిసిన తర్వాత సోమవారం సాయంత్రం 5.28 గంటలకు ఈ ఇస్రో బాహుబలి రాకెట్‌ జీశాట్‌-19 ఉపగ్రహంతో రోదసిలోకి దూసుకుపోనుంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -