Thursday, May 2, 2024
- Advertisement -

ఎవ‌డ్రా నువ్వు అన్న‌వారే నేడు సార్‌ అంటున్నారు: గెటప్ శ్రీను

- Advertisement -

‘జబర్దస్త్‌’ షో ఎంతో మందికి మూడు పూట‌లా అన్నం పెట్టే వేదికగా మారింది. ఈ షో వ‌ల‌న ఎంతోమంది క‌ళాకారులు బుల్లితెర‌కు, వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. ఈ షో వ‌ల్ల మ‌న ఇళ్ల‌ల్లో నవ్వుల వ‌ర్షం కురుస్తోంది. అయితే ఈ షో వ‌ల‌న తెర మీద‌కు వ‌చ్చిన వారంతా ఒక‌ప్పుడు క‌డు పేదిర‌కం, క‌ష్టాలు ఎదుర్కొన్న వారే. వారు న‌వ్వుల వెన‌క ఎంతో బాధ‌.. ఓర్పు ఉంది. ప్ర‌స్తుతం గెటప్ శ్రీను జ‌బ‌ర్ద‌స్త్‌లో ఒక ఫేమ‌స్ స్టార్‌గా మారాడు. త‌న‌దైన న‌ట‌న‌తో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్న అత‌డి జీవితం క‌ష్ట‌ల‌మ‌య‌మే. ఇటీవ‌ల ఓ షోలో త‌న క‌ష్టాల‌ను పంచుకున్నాడు. త‌న నేప‌థ్యం వివ‌రించాడు.

“కెరియర్ తొలినాళ్లలో చాలా కష్టాలు పడ్డాడంట‌. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న అత‌డు 2007లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను మాత్రం జీవితంలో మ‌ర‌చిపోలేదంట‌. అన్నపూర్ణ స్టూడియోలో ఓ సినిమా షూటింగ్ జరుగుతుండ‌గా అక్కడి ప్రొడక్షన్‌లో తెలిసిన వ్యక్తి ద్వారా షూటింగ్ చూద్దామని వెళ్లాడు. ఆ వ్యక్తి భోజనం చేయమంటేనే చేస్తున్నాడు. ఈ స‌మ‌యంలో ప్రొడక్షన్ ఇన్‌చార్జి అక్కడికి వచ్చి ‘ఎవడ్రా నువ్వు?’ అంటూ శ్రీనును ప‌ట్టుకొని కాలర్ పట్టుకుని బయటకు గెంటేశాడు.

ఈ విధంగా అవ‌మానం ఎదుర్కోవ‌డంతో వారం రోజులు ఏడ్చేశాడు. ఎక్కడి నుంచి బ‌య‌ట‌కు గెంటేశారో.. అదే స్టూడియోలో ఇప్పుడు షూటింగ్స్‌ల‌లో పాల్గొంటున్నాడు. ఇంతకు మించిన ఆనందం .. గర్వం ఏముంటుంద‌ని గ‌త జ్ఞాప‌కాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇంకో ముచ్చ‌ట కూడా చెప్పాడు.

త‌న‌ అమ్మానాన్నలకు ఇండస్ట్రీ అంటే ఏమిటి? .. సినిమాలంటే ఏమిటి? తెలియదు. వ్యవసాయం .. ఊరే వారి ప్రపంచంగా బ‌తుకుతుండ‌గా ఆ స‌మ‌యంలో ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చాడంట‌. సినిమాల గురించి త‌న అన్నయ్యకు బాగానే తెలుసు.

త‌న అన్న ప్రోత్సాహంతో వెనక ఉండి నడిపించడంతో ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చాడు. అప్పట్లో అప్పులపాలై.. మధ్యలోనే చదువు ఆపేసి వ‌చ్చా. ఆ అప్పులు తీర్చాలంటే .. సంపాదించాలి .. అందుకోసమే హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ వ‌స్తే ఏదో ఒక ఉపాధి చూసుకోవచ్చు.. అలాగే అవకాశాల కోసం తిరగొచ్చు అనే ఆలోచనతోనే హైద‌రాబాద్ వ‌చ్చిన శ్రీను అనుకున్న‌ట్టుగానే త‌న జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడు. ఈవిధంగా గెటప్ శ్రీను జీవితం క‌ష్టాల నుంచి ఇప్పుడు దారిలో ప‌డింది. ప్ర‌స్తుతం క‌ష్టాల‌న్నీ తీరిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. ఆనందంలో మునిగాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -