Saturday, April 27, 2024
- Advertisement -

జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు.. పీలేరులో అరెస్ట్..

- Advertisement -

ఇటీవ‌ల స‌స్పెండ్ అయిన మాజీ న్యాయ‌మూర్తి రామ‌కృష్ణ‌పై దేశ‌ద్రోహం కేసు న‌మోద‌యింది. ఆయ‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డంతో పాటు కోర్టులో హాజ‌రుప‌ర్చ‌డం.. న్యాయ‌స్థానం ఆయ‌న‌కు రిమాండ్ విధించ‌డం కూడా జ‌రిగిపోయింది. తాజాగా పోలీసులు ఆయ‌న అరెస్టుకు సంబంధించి వివ‌రాలు వెల్ల‌డించారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తూ ప్రజల్లో ద్వేషం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సస్పెండైన న్యాయమూర్తి రామకృష్ణపై చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు రామ‌కృష్ణ‌పై దేశ‌ద్రోహం కేసు న‌మోదు చేశారు.

కాగా, రామ‌కృష్ణ కోవిడ్‌-19 ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డానికి మ‌దనపల్లె వెళ్తుండగా పీలేరు ఎన్డీఆర్ కూడలి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ కార్యాలయానికి తరలించి అరెస్ట్ విష‌యాన్ని వెల్ల‌డించారు. అనంత‌రం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ఈ క్ర‌మంలోనే న్యాయ‌స్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ప్ర‌స్తుతం ఆయ‌నను పీలేరు సబ్‌జైలుకు త‌ర‌లించారు.

ఏపీలో కొత్తగా 5వేల మందికి కరోనా

క‌రోనాతో కాంగ్రెస్ అభ్య‌ర్థి మృతి..

ఇస్రో సైంటిస్టు అరెస్టు.. సీబీఐ విచార‌ణ‌కు ఆదేశం

కాకతీయగడ్డపై రుద్రమ తర్వాత మళ్లీ షర్మిలే.. !

టీకా తీసుకన్న సర్పంచ్ మృతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -