Thursday, May 9, 2024
- Advertisement -

ఈనెల 27 విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని సుజ‌నాకు ఈడీ నోటీసులు…అరెస్ట్ త‌ప్ప‌దా…?

- Advertisement -

చంద్ర‌బాబు బినామీల గుట్టును ర‌ట్టు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఇన్నాల్లు మేము నిప్పు అని డ‌బ్బాకొట్టుకున్న నాయ‌కుల‌కు ఈడీ చుక్క‌లు చూపిస్తోంది. భాజాపాతో టీడీపీ విడాకులు తీసుకున్న త‌ర్వాత ఈడీ కొర‌డా ఝులిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి ,టిడిపి రాజ్యసభ సభ్యుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి కంపెనీలలో సోదాలు చేసిన ఎన్-ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప‌లు కీల‌క డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకొంది.

పంచ వ్యాప్తంగా ఆయన ఆద్వర్యంలో ఏర్పాటైన 120 కంపెనీలు పెద్దఎత్తున బ్యాంకుల నుంచి ఋణాలు పొంది దుర్వినియోగం చేశారని అబియోగం వస్తోంది.ఇప్పటికే మారిషస్ బ్యాంక్ వంద కోట్ల ఋణానికి సంబందించి కోర్టులో పోరాటం చేస్తోంది. కాగా తాజాగా సుజనా చౌదరికి చెందిన లక్జరీ కార్లను కూడా ఎన్-పోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది.

ఈ ఉద‌యం మ‌రో సారి ఈడీ అధికారులు హైదరాబాద్ నాగార్జున హిల్స్‌లో ఉన్న బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో కంపెనీలకు చెందిన పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సుజనాచౌదరి డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్లు కొల్లగొట్టారని.. ఆయన సంస్థల్లో పనిచేస్తున్నఉద్యోగులను డైరెక్టర్‌లుగా పెట్టి షెల్ కంపెనీలు ప్రారంభించినట్లు సుజనా చౌదరిపై ఆరోపణలున్నాయి

గత అక్టోబర్‌లోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు చేశారు. అప్పట్లో పెద్ద ఎత్తున హార్డ్ డిస్క్‌లు , ఫైల్స్ , కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మూడు బ్యాంకుల నుంచి 304 కోట్ల రూపాయలు తీసుకొని దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఈడీ సుజ‌నాకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 27 న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది .రూ. 5700 కోట్లు బ్యాంకుల‌కు కుచ్చుటోపి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. సుజనా చౌదరి ఉపయోగిస్తున్న ఆరు కార్లును సీజ్ చేశారు. ఈ కార్ల‌న్నీ కూడ నకిలీ కంపెనీలపై రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఈడీ ప్రకటించింది. సుజనా గ్రూప్ కంపెనీలు రూ. 5700 కోట్లకు పైగా మోసం చేసినట్టు ఈడీ గుర్తించింది.

మ‌రో వైపు నాగార్జున హిల్స్ లో వివిధ షెల్ కంపెనీల్లో 126 రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకొన్నట్టు ఈడీ తెలిపింది. ఈ కంపెనీలన్నీ కూడ సుజనా గ్రూపుకు చెందినవిగా ఈడీ ప్రకటించింది. టీడీపీకి ఆర్థిక వనరుగా పేరొందిన సుజనా నిన్నమొన్నటివరకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయనపై ఇప్పటికే డీఆర్‌ఐ, ఫెమా, సీబీఐ కేసులు ఉన్నాయి.

ఆంధ్రా బ్యాంకు నుంచి రూ. 304 కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంకు నుంచి రూ. 120 కోట్లు, సెంట్రల్‌ బ్యాంకు నుంచి రూ. 124 కోట్లు సుజనా అప్పుగా తీసుకొని.. చాలావరకు నిధులను డొల్ల కంపెనీలకు తరలించారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఆయన బినామీ కంపెనీలు కేవలం రశీదులు రూపొందించి డబ్బు తరలించుకుపోయినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. గత మూడేళ్లుగా సాగుతున్న ఈ విచారణ ప్రస్తుతం కీలకదశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈడీ చేసిన సోదాల్లోనూ పెద్ద ఎత్తున డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -