Monday, May 6, 2024
- Advertisement -

అస్సాంలో భారీ భూకంపం..

- Advertisement -

అస్సాం లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.4 తీవ్రతగా నమోదైంది. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఉదయం 7.51 గంటల ప్రాంతంలో సోనిత్‌పూర్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 6.4 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. ఆ తర్వాత 8.13 గంటలకు.. 08.34 గంటలకు మూడోసారి సైతం ప్రకంపనలు వచ్చాయని వెల్లడించింది.

ఒకవైపు కరోనా మహమ్మారి అస్సాం ను వణికిస్తున్న తరుణంలో భూకంపం సంభవిచడంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. అస్సాంలో భూకంపాలు తరచుగా వస్తూనే ఉంటాయి. ఈ సమయంలో భూకంపం రావడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. సోనిత్పూర్, దేకియాజులీలో భూప్రకంపనలు చోటుచేసుకన్నాయి.

భూకంపం ధాటికి భవనాలు, ఇండ్లు ధ్వంసమయ్యాయి. అయితే భూకంపంతో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు అంటున్నారు. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడారు. అస్సాంలో పెద్దస్థాయిలో భూకంపం వచ్చిందని.. అందరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానంటూ తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి అన్ని జిల్లాల నుంచి నివేదికలు తీసుకుంటున్నామని.. జాగ్రత్తగా ఉండాలని సర్బానంద సోనోవాల్ సూచించారు.

తెలంగాణలో కరోనా విజృంభణ..

డిప్యూటీ మేయర్ కు కరోనా

నంద్యాలలో విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మొత్తం ఆత్మహత్య

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -