Tuesday, April 30, 2024
- Advertisement -

“మహానుభావుడు” మూవీ రివ్యూ

- Advertisement -

దర్శకుడు మారుతి.. ఈ రోజుల్లో.. బస్ స్టాప్ సినిమా లు తీసి దర్శకుడిగా నిరుపించుకున్నాడు. కానీ ఆ రెండు సినిమాలో డబల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ. దాంతో చాలా మంది మారుతిని విమర్శించారు. ఇక అప్పటి నుంచి అలాంటి సినిమాలు కాకుండా మంచి కామెడీ ఉన్న సినిమాలు చేస్తున్నాడు. వినోదాన్ని పంచే కుటుంబ కథా చిత్రాలకు ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. ‘బాబు బంగారం’ తర్వాత ‘మహానుభావుడు’ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ మారుతి. శర్వానంద్, మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

హీరో శర్వానంద్ ఓసీడీ (అతి శుభ్రత) తో బాధపడుతాడు.తనతో పాటు తన చుట్టూ ఉండే ప్రతి ఒక్కటి శుభ్రంగా ఉండాలని అనుకుంటాడు. పరిసరాలు, వస్తువులు కూడా శుభ్రంగా ఉండాలి. అలా కాకుండా ఎవరైనా చిన్న అశుభ్రతతో కనిపించినా ఓవర్ గా రియాక్టవుతుంటాడు. జబ్బుతో ఉంటే కనీసం కన్నతల్లిని కూడా దగ్గరకు రానివ్వనంతటి శుభ్రత అతనిది. అలాంటి లక్షణం కలిగిన హీరో.. హీరోయిన్ మెహ్రీన్ ను ప్రేమిస్తాడు. హీరోయిన్ కూడా అతన్ని ఇష్టపడి ఆరంభంలో అతని ఓసిడి లక్షణాల్ని పెద్దగా పట్టించుకోకపోయినా తర్వాత తర్వాత కొన్ని సందర్భాల వలన తట్టుకోలేక బ్రేకప్ చెబుతుంది. అలా ఓసిడి వలన ప్రేమను కోల్పోయిన హీరో తిరిగి ప్రేమను ఎలా దక్కించుకున్నాడు, ఓసిడికి, ప్రేమకి మధ్యన ఎలా నలిగిపోయాడు, చివరికి అతని జీవితం ఏమైంది అనేదే ఈ ‘మహానుభావుడు’ కథ.

విశ్లేషణ :

గతంలో మారుతి మతిమరుపు అనే కాన్సెప్ట్‌తో ‘భలే భలే మగాడివోయ్’ను తీసి సూపర్ హిట్ కొడితే.. ఈ సారి అతి శుభ్రత (ఓసీడీ) అనే వింత వ్యాధి నేపథ్యంలో ‘మహానుభావుడు’ను తెరకెక్కించి హిట్ కొట్టాడు. హీరో అతి శుభ్రతతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. మారుతి రాసుకున్న సీన్లు చాలా బాగున్నాయి. కామెడీ, లవ్ ట్రాక్‌తో సినిమాను బాగా నడిపించారు. కామెడీ తో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సమేతంగా థియేటర్‌కు వెళ్లి హాయిగా చూసే సినిమా ఇది. శర్వానంద్ ఎప్పుడు లానే తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక మేహ్రీన్ అయితే తన అందంతో.. తన నటనతో మరో మెట్టు ఎక్కింది. శర్వానంద్ మరియు మేహ్రీన్ జంట మద్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఇద్దరి స్క్రీన్ ప్రజేన్స్ కూడా బాగుంది. శర్వానంద్, వెన్నెల కిషోర్ మధ్య నడిచే కామెడీ సన్నివేశాలు.. శర్వానంద్, మెహ్రీన్ ప్రేమ కథతో పాటు మూడు పాటలు కూడా బాగున్నాయి. మొత్తానికి ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతోంది. ఈ సినిమాతో శర్వానంద్ మరో హిట్ కొట్టేసినట్లే అని చెప్పొచ్చు. అయితే భలే భలే మగాడివోయ్ సినిమాని దృష్టిలో పెట్టుకుని సినిమా చూస్తే.. అ స్థాయిని అందుకోలేరు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే.. ‘మహానుభావుడు’ తెగ నవ్విస్తాడు. ఈ సినిమా కి నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత ఎక్కడా ఖర్చు కి వెనుకాడలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. డైరెక్టర్ గా మారుతీ ఈ సినిమా తో మల్లి ట్రాక్ లోకి వచ్చాడు. తమన్ అందించిన సంగీతం బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

* శర్వానంద్ అండ్ మేహ్రిన్ పెయిర్
* కామెడీ అండ్ లవ్ ట్రాక్
* డైలాగులు
* ఆకట్టుకొనే పాటలు
* నిర్మాణ విలువలు
* సినిమాటోగ్రఫీ
* డైరెక్షన్
* లోకేషన్స్

మైనస్ పాయింట్స్ :

* సెంకడాఫ్ కాస్త నెమ్మదించడం
* అక్కడ అక్కడ రొటిన్ సీలు
* ముందే సీన్స్ ఊహించడం

మొత్తంగా :

దర్శకుడు కేవలం థియేటర్లో కుర్చున్న ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్వించాలని పిక్స్ అయినట్లున్నాడు. అందుకే ఎక్కువ భాగం కామెడి మీద, లవ్ ట్రాక్ మీద దృష్టి పెట్టాడు. ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. హీరోకి, హీరోయిన్ కి, దర్శకుడికి ఈ సినిమా మంచి సక్సెస్ ని ఇస్తోంది. ఈ దసరాకి కుటుంబంతో కలిసి ఆనందంగా ఈ సినిమాని చూడొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -