Tuesday, April 30, 2024
- Advertisement -

విశ్వసుందరిగా మెక్సికో భామ ఆండ్రియా!

- Advertisement -

మిస్ యూనివర్స్ 2021గా మెక్సికో యువతి ఆండ్రియా మేజ్ (26) ఎంపికయ్యారు. మాజీ విశ్వ సుందరి జోజిబినీ టుంజీ (దక్షిణాఫ్రికా).. ఆమెకు కిరీటాన్ని అలంకరించింది. ఆదివారం రాత్రి అమెరికాలోని ఫ్లోరిడాలో విశ్వ సుందరి గ్రాండ్ ఫినాలె జరిగింది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా ఆదివారం జరిగిన ఈ అందాల పోటీల్లో 70 దేశాలకు చెందిన అమ్మాయిలు పోటీపడ్డారు. ఈ పోటీల్లో ఆండ్రియా మేజ్ తొలి స్థానంలో నిలవగా.. ఫస్ట్ రన్నరప్‌గా బ్రెజిల్ సుందరి, రెండో రన్నరప్‌గా పెరూ యువతి నిలిచారు.

ఈ పోటీలో పాల్గొన్న భారతీయ యువతి అడ్డైన్ క్యాస్టిలినో మూడో రన్నరప్‌గా నిలవడం విశేషం. మియామి, ఫ్లోరిడాలోని సెమినోల్ హార్డ్ రాక్ హోటల్, క్యాసినో హాలీవుడ్‌లో ఈ పోటీలు నిర్వహించారు. విజేతగా నిలిచిన ఆండ్రియా మేజ్‌కు 2019 మిస్ యూనివర్స్ జోజిబిని తుంజీ కిరీటం అలంకరించారు. అందాల పోటీల నిర్వాహకులు ఆమెను కరోనాపై ప్రశ్నను సంధించారు.

‘‘నువ్వే మీ దేశానికి నాయకురాలివైతే కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొనేదానివి?’’ అనే ప్రశ్న అడిగారు. దానికి ఆమె సూటిగా ‘లాక్ డౌన్’ పెట్టేదాన్నంటూ సమాధానమిచ్చింది. ప్రాణాలు పోకముందే ఆ నిర్ణయాన్ని తీసుకునేదాన్ని. ఇప్పటికే మేం చాలా మందిని కోల్పోయాం. లాక్ డౌన్ ను మేం తట్టుకోలేమనే విషయం తెలుసు. కానీ, ప్రజల రక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలి. కాబట్టి ముందు నుంచీ నేను ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూనే ఉన్నాను’’ అని ఆండ్రియా చెప్పుకొచ్చింది.

మిస్ యూనివర్స్‌ కిరీటం దక్కించుకున్న మూడో మెక్సికన్ మహిళగా ఆండ్రియా రికార్డు నెలకొల్పారు. ఆండ్రియా మేజా సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. మహిళా హక్కుల కోసం పోరాడుతోంది. మహిళా హక్కుల కోసం ఏర్పాటు చేసిన మున్సిపల్ ఇనిస్టిట్యూట్ ఫర్ విమెన్ తరఫునా పనిచేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -