Thursday, May 2, 2024
- Advertisement -

తిట్టారని అత్తమామలను అరెస్ట్ చేయలేం..!

- Advertisement -

కుటుంబ కలహాలపై ముంబయి సెషన్స్​ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్తమామల నుంచి నిందలు, తిట్లు, వ్యంగ్యంగా మాట్లాడటం వైవాహిక జీవితంలో ఒక భాగమేనని పేర్కొంది. అది ప్రతి కుటుంబంలో ఉంటుందని, అందుకు వృద్ధ దంపతులను అరెస్ట్​ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కోడలి పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నట్లు నమోదైన ఓ కేసులో వృద్ధ దంపతులకు ముందస్తు బెయిల్​ మంజూరు చేసింది.

ముంబయికి చెందిన ఓ మహిళ తన అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త.. వారి సొంత కుమారుడు కాదన్న విషయం వివాహం అయ్యే వరకు తనకు తెలియదని, పెళ్లి చేసుకునే కొద్ది రోజుల ముందే దత్తత తీసుకున్నట్లు పేర్కొంది. తన పెళ్లిలో ఎలాంటి బహుమతులు ఇవ్వలేదని, తన తల్లిగారింటికి వెళ్లేందుకు అనుమతించకపోవం, ఇంట్లో కనీసం రిఫ్రిజిరేటర్​ కూడా తాకనివ్వట్లేదని, పాడైపోయిన భోజనం పెడుతున్నారంటూ ఆరోపించింది.

ఈ విషయమై ఆ మహిళ తన భర్తకు చెప్పగా.. వారితో ప్రేమగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. మరోవైపు.. తమపై కేసు నమోదైన విషయమే తెలియదని వృద్ధ దంపతులు తెలిపారు.ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత.. ఎఫ్​ఐఆర్​లో నమోదు చేసిన ఆరోపణలు కుటుంబాల్లో సాధారణంగా జరిగే అంశాలేనని పేర్కొంది కోర్టు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -