Monday, May 6, 2024
- Advertisement -

మరో సంచలనం.. వైసీపీలోకి మాజీ స్పీకర్

- Advertisement -
Nadendla Manohar to Join YSRCP

ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం జోరందుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు – మాజీ మంత్రులు వైసీపీ కండువా కప్పుకోగా తాజాగా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తనయుడు – మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వైసీపీలో చేరేందుకు రంగం దాదాపు ఖాయ‌మైన‌ట్లు స‌మాచారం.

ఈ మేరకు ఆయన తన భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.దీంతో ఇప్పుడు గుంటూరు రాజ‌కీయాల్లో పెనుసంచ‌ల‌నాలు చోటు చేస‌కుంటున్నాయి. నాదెండ్ల రాక‌తో రాజ‌ధాని ప్రాంతంలో బ‌ల‌హీనంగా ఉన్న వైసీపీ బ‌లోపేత‌మ‌వ‌డం కాయ‌మ‌ని వైసీపీ శ్రేనులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

నాదెండ్ల మ‌నోహ‌ర్ గుంటూరు జిల్లా తెనాలి నియేజ‌క వ‌ర్గం నుండి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్పీక‌ర్‌గా ప‌నిచేశారు.రాష్ట్ర విబ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన ప‌రినామాల‌తో కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింద‌నే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు,మాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్యేలు వేరే పార్టీల‌ను చూసుకోగా నాదెండ్ల మాత్రం వైసీపీ వైపు చూస్తున్న‌ట్లా స‌మాచారం. నారాచంద్ర‌బాబునాయుడుకు … నాదెండ్ల భాస్క‌ర్‌రెడ్డి కుటుంబాలు బ‌ద్ద విరోధులు కాబ‌ట్టి ఖశ్చితంగా జ‌గ‌న్ పార్టీలోకి వ‌స్తార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మరోవైపు సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే గడువు ఉండటంతో ఇటీవల బలం పుంజుకున్న ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి నిర్ణయించుకున్నట్టు గుంటూరు జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అందుకే ఆయ‌న‌రాక‌కు జ‌గ‌న్ ప‌చ్చ‌జెండా ఊపిన‌ట్లు తెలుస్తోంది. మాజీ స్పీక‌ర్‌తోపాటు ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేల‌తోపాటు ..ఒక మంత్రి కూడా వైసీపీ గూటికి వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. వ‌ల‌స‌ల‌తో రాజ‌ధాని ప్రాంతంలో బ‌ల‌హీనంగా ఉన్న వైసీపీ బ‌లం పుంజు కోవ‌డంతో టీడీపీ శ్రేనుల్లో ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.

{youtube}FGg7sVCacD8{/youtube}

Related

  1. చంద్రబాబుకు ఊహించని షాక్.. వైసీపీలో కి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే
  2. టీడీపీ లో అవమానాలు తట్టుకోలేక సొంత‌గూటికి వైసీపీ ఎమ్మెల్యేలు
  3. రాజకీయాల్లో కొత్త పరిణామం.. వైసీపీలోకి మాజీ మంత్రి
  4. ఏపీ రాజకీయాలో మరో సంచలనం.. వైసీపీలోకి కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -