త్వ‌ర‌లోనే వెండితెర‌పై నాగార్జున బ్ర‌హ్మ‌స్త్ర‌

- Advertisement -

న‌వ మ‌న్మథుడు నాగార్జున… సీని ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు. ఆయ‌నకు తెలుగు నాట‌నే కాకుండా దేశ‌వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌ల‌లో నూ ప‌లు సినిమాలు చేసి.. అక్క‌డ కూడా త‌న క్రేజ్ ను పెంచుకున్నాడు ఈ కింగ్‌.

1990లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యువ సామ్రాట్ నాగార్జున.. ద్రోహీ, ఖుదా గ‌వా, క్రిమిన‌ల్‌, జ‌క్మ్ వంటి సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇక హిందిలో చివ‌రిసారిగా 2003లో ఎల్‌వోసీ కార్గిల్ అనే సినిమాలో క‌నిపించారు. అయితే, మ‌ళ్లీ ప్ర‌స్తుతం ఆయ‌న ఓ హిందీ సినిమా చేస్తున్నారు. అదే బ్ర‌హ్మ‌స్త్ర‌. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న‌ది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి కింగ్ నాగార్జున పాత్ర‌కు షూటింగ్ పూర్తి అయింద‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. నాగార్జున సైతం సోష‌ల్ మీడియా ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాను హిందీ, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, మౌనీరాయ్‌, ర‌ణ్‌బీర్, అలియాలు న‌టిస్తున్నారు.

కీచ‌క ప్రిన్సిప‌ల్ కు ఉరిశిక్ష‌.. స‌హ‌క‌రించిన టీచ‌ర్ కు జీవిత ఖైది!

అనసూయను అవ‌స‌రానికి వాడుకున్నారట !

మ‌ళ్లీ ఒక‌టిగా క‌నిపించ‌నున్న షారుఖ్, స‌ల్మాన్ !

స్పై ‘ఏజెంట్ వినోద్’గా కళ్యాణ్ రామ్ !

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -