Monday, May 6, 2024
- Advertisement -

మ‌హానాడు సాక్షిగా లోకేష్ విసిరిన ద‌మ్మున్న స‌వాల్‌ను వైసీపీ స్వీక‌రిస్తుందా..?

- Advertisement -
Nara Lokesh Challenge to YSRCP President YS Jagan Mohan Reddy in Mahanadu

ఆంద్ర‌ప్ర‌దేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ విశాఖ మ‌హానాడు సాక్షిగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌,పార్టీ నాయ‌కుల‌పై నిప్పులు చెరిగారు. రాజ‌ధాని అభివృద్దిని జ‌గ‌న్ అడ్డుకుంటున్నార‌ని విమ‌ర్శించారు.

బోగాపురం విమానాశ్రయం, ఇతర పరిశ్రమలకు భూములు ఇవ్వవద్దని జగన్ చెబుతున్నారని నారా లోకేష్ ఆరోపించారు.అరచేతిని అఢ్డుగా పెట్టి సూర్యకాంతిని ఆపలేరని, జగన్ అడ్డంగా పడుకున్నా ఏపీ అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు.
మ‌హానాడు ముగింపు రోజు నారాలోకేష్ ప్ర‌సంగించారు.వైజాగ్‌ను ఐటీ హ‌బ్‌గా తీర్చి దిద్దే బాద్య‌త నేనే తీసుకుంటాన్నారు. ప‌నిలో ప‌నిగా వైసీనీ ఏకేశారు. జగన్ ఎవరి మధ్యనైనా చిచ్చు పెట్టగలరని, మనం అప్రమత్తంగా ఉండాలని టిడిపి నేతలు, కార్యకర్తలకు సూచించారు. జగన్, ఆయన దొంగ పత్రిక తనకు, తన తండ్రికి కూడా మధ్య చిచ్చు పెట్టాలని చూశారని నారా లోకేష్ ఆరోపించారు.

{loadmodule mod_custom,Side Ad 1}

చంద్రబాబు పట్టిసీమకు నీరు తీసుకు రావాలని కష్టపడితో దొంగబ్బాయి మాత్రం గోదావరి జిల్లాలకు వెళ్లి.. ఇక్కడి నీరు సీమకు తీసుకు వెళ్తున్నారని చెప్పాడని, రాయలసీమకు వెళ్లి, పట్టిసీమతో ఒక్క చుక్క రాదని చెప్పాడని, ఇది ప్రాంతాల మధ్య చిచ్చు అన్నారు.
నాపై జ‌గ‌న్ చేసిన ఆరోప‌న‌లు చూస్తె విడ్డూరంగా ఉంద‌న్నారు. నేను పుట్టే నాటికి నా తాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అని, నా కొడుకు దేవాన్ష్ పుట్టే నాటికి ఆయన తాత చంద్రబాబు సీఎం అని, కానీ మాపై అవినీతి ఆరోపణలను జగన్ నిరూపించారా అని సవాల్ చేశారు. మన ఇద్దరి అవినీతిపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధమని జగన్‌కు సవాల్ విసిరారు. జ‌గ‌న్ లాగా త‌ర తండ్రికి చెడ్డ‌పేరు మాత్రం తీసుకురానన్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

లోకేష్ గ‌తంలో కూడా ఇలాంటి స‌వాల్‌నే జ‌గ‌న్‌కు విసిరారు.వైసిపి అధినేత వైయస్ జగన్, ఆయన పార్టీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం విడ్డూరమని నారా లోకేష్ అన్నారు. మ‌రి లోకేష్ చేసిన స‌వాల్‌ను స్వీక‌రిస్తారా లేక వైసీపీ నాయ‌కులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

{youtube}bAdjdpLh9jo{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -