Friday, May 10, 2024
- Advertisement -

మ‌హానాయ‌కుడు విడుద‌ల‌ ఆల‌స్యానికి కార‌ణం అదేనా…?

- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బాల్యం, కథానాయకుడిగా ఎదిగిన తీరుని మొదటి భాగం ఎన్టీఆర్ ‘కథానాయకుడు’లో చూపించనున్నారు. ఇక ఆయన రాజకీయ ప్రస్థానాన్ని రెండో భాగం ‘మహానాయకుడు’లో చూపించబోతున్నారు.

అయితే ఈ రెండు చిత్రాలను జనవరిలో రెండు వారాల తేడాలో విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిర్మాతలు మార్చుకున్నారని తెలుస్తోంది. జనవరి 9న మొదటి భాగాన్ని, ఆపై 15 రోజుల తరువాత జనవరి 24న రెండో భాగాన్ని విడుదల చేసేందుకు దర్శకుడు క్రిష్ ప్లాన్ చేశారన్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ వర్గాల తాజా సమాచారం మేరకు రెండు వారాల మధ్య మరింత గ్యాప్ ఉంటే బాగుంటుందని యూనిట్ భావిస్తోందట. రెండో భాగం విడుదలయ్యే సమయానికి చాలా ప్రాంతాల్లో మొదటి భాగం కూడా ఆడుతూనే ఉంటుందని, దీంతో రెండో భాగానికి థియేటర్ల సమస్య వస్తుందన్న ఆలోచనలో ఉన్న క్రిష్, ఫిబ్రవరికి వాయిదా వేయాలని భావిస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ ని అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

రెండు సినిమాల మధ్య కనీసం నాలుగు వారాల గ్యాప్ ఉండేట్టుగా ఫిబ్రవరి తొలివారంలో ‘మహానాయకుడు’ వస్తుందని తెలుస్తోంది. తొలి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవిత విశేషాలను, రెండో భాగంలో రాజకీయ నాయకుడిగా ఆయన వైభవాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుద‌ళ తేదీల‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -