Thursday, May 2, 2024
- Advertisement -

నన్ను చంపేస్తా అని బెదిరించారు.. ఆవేశం గా మాట్లాడిన పవన్

- Advertisement -
pawan says “i Got DEATH THREATS ” But i’m Not Afraid of Anyone

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యుఎస్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించేందుకు అమెరికా వెళ్లిన పవన్.. న్యూహాంప్‌షైర్‌లో జరిగిన ఓ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సినిమాల్లో తానెప్పుడూ సౌకర్యంగా ఫీలవలేదన్నారు. సినిమాలకన్నా ప్రజాసమస్యలపై పోరాటమే తనకు సంతృప్తినిచ్చిందని పవన్ తెలిపారు.అన్యాయం ఎక్కడున్నా తాను సహించనని అన్నారు. తనకు అధికారం అంతిమ లక్ష్యం కాదని అన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటం ప్రారంభించినప్పుడు తనకు నిజమైన సంతృప్తి లభించిందని చెప్పారు. దేశం మనకేమిచ్చిందని కాదు, దేశానికి మనమేమిచ్చామని ఆలోచించాలని అన్నారు. సినిమాల కన్నా ఎక్కువగా ప్రజా సమస్యలపై పోరాటం చేసినప్పుడు సంతృప్తి లభించిందని అన్నారు. ప్రసంగం మధ్యలో ఆయన గబ్బర్ సింగ్ టవల్ వేసుకున్నారు. ఇది గబ్బర్ సింగ్ సింబల్ కాదని, సామాన్యుడి సింబల్ అని అన్నారు. భారతదేశంలో దీనికి కులం, మతం లేదని అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా మంది భయపెట్టారని, చంపేస్తారని బెదిరించారని చెబుతూ భయపడితే ఇంతా దాకా వస్తామా అని అడిగారు. తనకు జాగ్రత్త ఉంది గానీ భయం లేదని చెప్పారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే ఎదుర్కుంటానని అన్నారు. రోజూ చావడం కన్నా ఒక్క రోజు చావడం మంచిదని అన్నారు.

జానీ సినిమా సక్సెస్ అయి ఉంటే సినిమాలు వదిలేసేవాడినేమో అన్నారు. సినిమాల్లో సంతోషం ఉందని అన్నారు. సినిమాల ద్వారా ఇమేజ్ వస్తుందని అన్నారు. సినిమాల ద్వారా వచ్చిన ఇమేజ్‌ను ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వాడుకుంటానని చెప్పారు. అందుకే సినిమాలు చేస్తానని చెప్పారు. బాధ్యతలు ఎక్కువైనప్పుడు సినిమాలకు దూరంగా ఉంటామనేమో గానీ వదిలేయనని అన్నారు. సినిమాల ద్వారా ఇమేజ్, డబ్బూ వస్తుందని చెప్పారు. నిజ జీవితంలో సినిమా డైలాగులు చెప్పబోనని అన్నారు. మీలో నుంచి నాకు బలమైన నాయకత్వం కావాలని అన్నారు. తనకు రాజకీయాలపై పూర్తి అవగాహన లేకపోయినా.. సమాజాన్ని చదివే అలవాటుందని పవన్ కల్యాణ్ చెప్పారు.

Related

  1. మళ్లీ పవన్ ఫ్యాన్స్.. బన్నీ ఫ్యాన్స్ మధ్య.. పెద్ద గొడవ.. ఏం జరిగింది..?
  2. నానికి పవన్ లవర్ కి లింక్ ఏంటి..?
  3. పవన్ బోస్టన్ ఎందుకు వెళ్లారంటే..?
  4. ముడో భార్యకి కూడా పవన్ విడాకులు ఇవ్వబోతున్నాడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -