Saturday, April 27, 2024
- Advertisement -

సుప్రీంలో 94 ఏళ్ల వృద్ధురాలి పిటిషన్.. పాయింటే..!

- Advertisement -

1975లో ఎమర్జెన్సీ విధించడాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఓ 94 ఏళ్ల వృద్ధురాలు సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఎమర్జెన్సీ వల్ల నష్టపోయిన తనకు పరిహారంగా రూ.25కోట్లు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఢిల్లీ కి చెందిన వీణా సారిన్​ అనే వృద్ధురాలు ఈ పిటిషన్​ వేశారు. దీనిపై జస్టిస్​ సంజయ్​ కిషన్​ కౌల్​, జస్టిస్​ దినేశ్​ మహేశ్వరి, జస్టిస్​ హరిషికేశ్​ రాయ్​లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. సోమవారం విచారణ చేపట్టనుంది.

1975లో విధించిన ఎమర్జెన్సీ కాలంలో తమపై జరిగిన దాడుల నుంచి కోలుకోవడానికి ఒక జీవితకాలం పట్టిందని తన అభ్యర్థనలో వీణా పేర్కొన్నారు. తమను జైల్లో వేస్తారనే భయంతో దేశాన్ని వదిలి వెళ్లాలనుకున్నామని చెప్పారు. ప్రభుత్వాధికారులు తమ ఇష్టానుసారం ప్రజల హక్కులకు భంగం కల్పించారని అన్నారు.

ఎమర్జెన్సీ వల్ల ఒత్తిడితో తన భర్త ప్రాణాలు కోల్పోయారని వీణా సారిన్​​​ తన పిటిషన్​లో పేర్కొన్నారు. అప్పటినుంచి తాను ఒంటరిగా బతుకు వెళ్లదీస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం తన కుమార్తెతో కలిసి దెేహ్రాదూన్​లో ఉంటున్నానని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -