Tuesday, April 30, 2024
- Advertisement -

గెట్ రెడీ త్రీ క్యాపిటల్స్.. ఇక అడ్డే లేదా?

- Advertisement -

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని సంచలన నిర్ణయాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వాటిలో మూడు రాజధానుల ప్రస్తావన కూడా ఒకటి. అధివృద్ది వికేంద్రీకరణ జరిగితేనే అన్నీ ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని అందుకే ఏపీ లోని ఏపీలోని ప్రాంతాలలో అభివృద్దే లక్ష్యంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ సర్కార్ దృఢ నిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మూడు రాజధానుల అమలు విషయంలో అడుగడుగున అడ్డంకులే ఎదుర్కొంటోంది జగన్ సర్కార్.. ఒకవైపు ప్రతిపక్ష పార్టీల నుంచి మరోవైపు అమరావతి రైతుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. .

అయినప్పటికి మూడు రాజధానులను అమలు చేసే తీరుతామని జగన్ సర్కార్ గట్టి పట్టుదలగా ఉన్న నేపథ్యంలో అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో అమరావతి రైతులకు ఫేవర్ గా హైకోర్టు మూడు రాజధానుల అమలుపై స్టే విధించింది. దాంతో జగన్ సర్కార్ నిర్ణయానికి కొంత బ్రేకులు పడ్డాయనే చెప్పాలి. అయినప్పటికి ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది జగన్ సర్కార్. ఇక తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో జగన్ ప్రభుత్వానికి కొంత ఊరట కలిగింది. అభివృద్ది అంతా ఒకే చోట కెంద్రీకరించడం సరికాదని వికేంద్రీకరణకు మద్దతుగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

అంతే కాకుండా అభివృద్ది ఎలా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని, అందులో హైకోర్టు జోక్యం అనవసరం అని తేల్చి చెప్పింది అత్యున్నత ధర్మాసనం. ఇక సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కసారిగా ఊపిరి లేచివచ్చినట్లైంది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ వైసీపీ నేతలు ఉబ్బి తబ్బుబ్బి అవుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన వ్యాఖ్యలు వికేంద్రీకరణను బలపరుస్తున్నాయని, ఇకనైనా ప్రతిపక్ష పార్టీ మూడు రాజధానులకు మద్దతుగా నిలవాలని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఇక త్వరలోనే అమరావతి నుంచి పరిపాలన విశాఖకు మరాబోతుందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఏది ఏమైనప్పటికి మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గని జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మంచి బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక మూడు రాజధానుల అమలుకై జగన్ సర్కార్ వేగంగా పావులు కడిపే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మనవాడే అనుకుంటే.. మనకే దేబ్బెస్తున్న బ్రిటన్ ప్రధాని!

పోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా..?

త్రీ క్యాపిటల్స్ స్వలాభమా.. ప్రజా లాభమా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -