Monday, April 29, 2024
- Advertisement -

ర‌ఫెల్ కేసులో సుప్రీంకు వింత స‌మాధానం చెప్పిన కేంద్రం..

- Advertisement -

దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ డీల్ వివాదంలో సుప్రీంకోర్టుకు వింత స‌మాధానం చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం. ర‌క్ష‌ణ‌శాఖ నుంచి డీల్‌కు సంబందించిన ప‌త్రాలు దొంగిలించ‌బ‌డ్డాయ‌ని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చారు. రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువుగా నిలిచిన రాఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో దాఖలైన రివ్యూ పిటిషన్‌లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ నిర్వహించింది. శాఖలోని కొందరు ఉద్యోగులే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని, దీనిపై దర్యాప్తు ఇంకా పెండింగ్‌లోనే ఉందని పేర్కొన్నారు. ఆ సీక్రెట్ ఫైల్స్ ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌రాదు అంటూ అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. పత్రాలు దొంగలించిన వారు.. అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు దోషులుగా మారుతారని ఆయన తెలిపారు. అయితే, ఈ విషయంలో చట్టపరమైన ఉల్లంఘనలేమీ లేవని, ఈ పత్రాల్లోని సమాచారం సమాచార హక్కు చట్టం పరిధిలోనేదేనని ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టుకు స్పష్టం చేశారు.ఇదే ఇష్యూపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం కొనసాగిన సంగతి తెలిసిందే. 36 రాఫేల్ యుద్ధ విమానాల కోనుగోలులో ఎటువంటి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని గ‌త ఏడాది డిసెంబ‌ర్ 14వ తేదీన సుప్రీంకోర్టు మోదీ ప్ర‌భుత్వానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే ద హిందూ ప‌త్రిక రిలీజ్ చేసిన కొన్ని అంశాల ఆధారంగా కోర్టు మ‌ళ్లీ త‌న తీర్పును పునర్ స‌మీక్షించేందుకు అంగీక‌రించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -