Tuesday, May 7, 2024
- Advertisement -

రామ్ గోపాల్ వర్మ మీద పోలీస్ కేసు

- Advertisement -

వివాదాలతో కాపురం చేయడం అంటే రామ్ గోపాల్ వర్మకి చాలా ఇష్టం. అందుకే ప్రతీ సందర్భాన్ని ఇందుకోసమే వాడేస్తుంటాడు. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా.. ఈ దర్శకుడు కొన్ని ట్వీట్స్ చేశాడు. అవన్నీ ఉపాధ్యాయులను అవమానించేలా ఉన్నవే అని చెప్పాల్సిందే.

పైగా తన టీచర్స్(లిక్కర్) అయితే చాలా విషయాలు నేర్పిందని కూడా అనేశాడు. సరిగ్గా గురువులను పూజించే ఉపాధ్యాయ దినోత్సవం రోజున వర్మ చేసిన కామెంట్స్.. టీచర్స్ కు మండించాయి. అందుకే ఓ పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చేశారు. ‘వర్మ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం’ అంటూ తనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన వర్మ.. ఆ కంప్లెయింట్ లెటర్ ను కూడా పోస్ట్ చేశాడు.

పైగా తనపై కంప్లెయింట్ చేసిన టీచర్స్ కి నా సమాధానం ఏంటంటే అంటూ.. వెక్కిరిస్తున్నట్లుగా కాసిన్ని ఎమోజీలు పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. యువత టీచర్స్ చెప్పే వాటిని వినద్దని.. అలా వినడం మానేసి సినిమాలు చూడ్డంతోనే ఇప్పుడు డైరెక్టర్ అయ్యానని.. వాళ్లు చెప్పినవి మర్చిపోవడానికి రాత్రంతా ఫిక్షన్ నవలలు చదివే వాడినని.. స్కూల్ లో కామిక్ పుస్తకాలు చదువుకోనివ్వలేదని.. ఇలా రకరకాలు ట్వీట్స్ పెట్టిన వర్మ.. తాను సాధారణంగా విస్కీ ఇష్టపడకపోయినా.. టీచర్స్ బ్రాండ్ మాత్రం బాగా ఇష్టమన్నాడు. చిన్నప్పుడు తన తలపై డెస్టర్ ఓ టీచర్ కొట్టడంతో.. తన బుర్ర పోయిందంటూ కామెడీ కూడా చేశాడు. ఇన్ని అనేశాడు కాబట్టే.. వాళ్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

Related

  1. సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ కేక
  2. వర్మ హీరోయిన్ వ్యభిచారిణిగా మారింది!
  3. ట్విట్టర్ లో రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ
  4. వరుణ్ ని తెగ మెచ్చుకున్న వర్మ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -