Friday, April 26, 2024
- Advertisement -

“రాష్ట్రపత్ని” అనడం తప్పేనా ?

- Advertisement -

ఇటీవల లోక్ సభ సమావేశాలలో కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత అధిర రంజన్ చౌదరి రాష్ట్రపతి ని ” రాష్ట్రపత్ని ” అని సంభోదించిన సంగతి తెలిసిందే. దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతి హోదా లో ఉన్న ఒక ఆదివాసీ మహిళను చిన్న చూపు చూస్తూ ” రాష్ట్రపత్ని ” అని అనడంపై బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధిర రంజన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి వివరణ కోరుతూ ఆయనకు నోటీసులుకు కూడా పంపించింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ వివాదంతో ఏమాత్రం సంబంధం లేని సోనియా గాంధీకి కూడా నోటీసులు పంపించడం గమనార్హం. లోక్ సభలో కూడా సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని బిజెపి నేతలు డిమాండ్ చేశారు..

ఇక ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారడంతో అధిర రంజన్ రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పడం జరిగింది. ” రాష్ట్ర పత్ని ” అనడం తప్పేనని..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్ మెంట్ కోరి ఆమెను వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇస్తానంటూ తెలిపాడు. ఇదిలా ఉంచితే గతంలో బీజేపీ నేతలు లోక్ సభలో సోనియా గాంధీని ఏమన్నారో గుర్తు చేసుకోవాలని అధిర రంజన్ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ” రాష్ట్ర పత్ని ” అనడం తప్పేనని అధిర రంజన్ క్షమాపణ చెప్పినప్పటికి.. బీజేపీ నేతలు ఈ వివాదాన్ని మరింత పెద్దగా చేస్తున్నారు. అయితే గతంలో ఇదే బీజేపీకి చెందిన ఎం‌పి ప్రజ్ఞ సింగ్ ఠాకూర్ మహాత్మా గాంధీ ని చంపిన గాడ్సే ను దేశ భక్తుడంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

మరి దేశ జాతిపిత మహాత్మా గాంధీని అగౌరపరిచిన ప్రజ్ఞ సింగ్ ఠాకూర్ తరుపున నరేంద్ర మోడి క్షమాపణ చెప్పలేదు కదా ? మరి ఇప్పుడు రాష్టపత్ని అన్న అధిర రంజన్ తరుపున ఈ వివాదానికి ఏమాత్రం సంబంధం లేని సోనియా గాంధీ ఎందుకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రపత్ని అనడం తప్పే కాబట్టి అధిర రంజన్ పై సస్పెన్షన్ వేటు వేయకుండా మొత్తం పార్లమెంట్ సభలను వాయిదా వేయడం ఏంటని విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలా సభలను వాయిదా వేయడం వల్ల.. ఇటీవల భీజెపి ప్రభుత్వంపై వ్యతిరేకత చూపిన జే‌ఎస్‌టి పెరుగుదల, అగ్నిపథ్ వంటి అంశాలను చర్చకు రాకుండా ఆపడంలో బిజెపి నేతలు సక్సస్ అయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి ” రాష్ట్రపత్ని ” అన్నందుకూ కాంగ్రెస్ నేత అధిర రంజన్ చౌదరి క్షమాపణ చెప్పినప్పటికి.. బిజెపి నేతలు మాత్రం ఈ విషయాన్ని బూతద్దంలో చూస్తూ విలువైన సభాసమయాన్ని వృధా చేస్తూ సభలో చర్చించాల్సిన కీలక అంశాలను తప్పుదోవ పట్టించారనేది కాదనలేని వాస్తవం.

Also Read

బీజేపీతో సమరానికి సిద్దమైన జగన్ ?

ఆ విషయంలో.. మాట తప్పిన మోడీ !

కాలుదువ్వుతోన్న కిమ్.. ఇక యుద్దమేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -