Sunday, April 28, 2024
- Advertisement -

త్వ‌ర‌లో ఆండ్రాయిడ్ ఫోన్లును ఉత్ప‌త్తిపై దృష్టి పెట్టిన జియో…..

- Advertisement -

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో భార‌త దేశ మొబైల్ రంగాన్ని మార్చి వేసింది. జియో దెబ్బ‌కు టెలికం కంపెనీల‌న్ని దిగివ‌చ్చాయి. ఉచిత ఆఫర్లు, ఉచిత డేటా ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలకు గుబులు పుట్టించిన జియో ఇపుడు తన గేమ్‌ప్లాన్‌ను మార్చింది. ముందుగా జియో ఫీచ‌ర్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన రిల‌య‌న్స్ ఫోన్‌లో చర్‌ఫోన్‌లో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లాంటి సోషల్‌మీడియా సైట్ల సపోర్టు లేకపోవడంతో తాజాగా ఆండ్రాయిడ్‌ ఫోన్లను ఉచితంగా అందించనున్న‌ట్లు సమాచారం.

ముఖ్యంగా టెలికాం మార్కెట్‌లో ప్రధాన పోటీదారులైన ఎయిర్‌ టెల్‌, వొడాఫోన్‌లకు షాకిచ్చేలా జియో పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో జియో ఫీచర్‌ ఫోన్‌ ఉత్పత్తిని నిలిపివేసి ఆండ్రాయిడ్‌ ఫోన్ల తయారీపై దృష్టి కేంద్రీకరించిందనీ ఒక నివేదిక వెల్లడించింది. అంతేకాదు ఫేస్‌బుక్‌, గూగుల్‌లాంటి సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు కూడా చేపట్టినట్టు నివేదించింది.

మరోవైపు ఆండ్రాయిడ్‌ ఫోన్‌ అంచనాలను జియో ప్రతినిధులెవ‌రు ఖండించ‌లేదు. కానీ, త్వరలోనే జియో ఫోన్ బుకింగ్ తేదీని ప్రకటించనున్నట్లు చెప్పారు. ‘ఇండియా కా స్మార్ట్‌ఫోన్‌ ద్వారా డిజిటల్‌ ఇండియాకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -