Thursday, May 2, 2024
- Advertisement -

ఎలుక రెస్క్యూ ఆప‌రేష‌న్‌.. వైర‌ల్ వీడియో

- Advertisement -

కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను తీశారు అనే సామెత ఉంది. మీరు వినే ఉంటారు. కానీ జ‌ర్మ‌నీలో ఎలుక‌ను తీయ‌డానికి ఓ కొండ‌ను త‌వ్వినంత ప‌నిచేశారు. ఓ ఎలుక ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతుంటే మ‌నం ఏం చేస్తాం.. ఆ మ‌న‌కేందుకులే అని వ‌దిలేస్తాం. కానీ ఆ జ‌ర్మ‌నీలో అలా కాదు.. ఓ మ్యాన్ హోల్‌లో చిక్కుకున్న ఎలుక‌ను ఓ రెస్క్యూ టీమ్ 25 నిమిషాల పాటు కిందా మీదా ప‌డి దానిని ర‌క్షించారు. ఇది నిజంగా నిజం. జర్మనీలోని బెన్‌షీమ్ పట్టణంలోని ఓ రోడ్ వెంట‌ మ్యాన్ హోల్స్ ఉన్నాయి. బొద్దుగా ఉన్న ఓ ఎలుక మార్గమధ్యలో ఉన్న మ్యాన్‌హోల్‌పై నుంచి వస్తుండగా.. చిన్న రంధ్రంలో ఇరుక్కుపోయింది. అదే మ‌న ఇండియాలో అయితే మ‌నుషుల‌నే ప‌ట్టించుకోం ఇక అది ఎలుక… దాని చావు అదే చ‌స్తుంది.. మ‌న‌కెందుకులే అని మ‌న దారిన మ‌నం పోతాం.

కానీ జ‌ర్మ‌నీలో ఈ విషయం తెలుసుకున్న యానిమల్ రెస్క్యూ టీం మ్యాన్ హోల్ వద్దకు వచ్చింది. ఎనిమిది మంది స‌భ్యులున్న ఆ రెస్క్యూ టీం 25 నిమిషాల పాటు కష్టపడి.. ఎలుకను ఎలాంటి ఇబ్బంది కలగకుండా మ్యాన్‌హోల్ నుంచి బయటకు వచ్చేలా చేశారు. ఎలాంటి గాయం కాకుండా ఎలుకను రక్షించి అటవీప్రాంతంలోకి వదిలిపెట్టామని రెస్యూటీం సభ్యుడు ఒకరు తెలిపారు.

ఇక ఈ రెస్క్యూ ఆప‌రేష‌న్ వీడియో ఇలా నెట్ కెక్కిందో లేదో అలా వైర‌ల్ అయిపోయింది. ఎలుకను ప్రాణాలు కాపాడిన రెస్క్యూ టీంను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు నెటిజ‌న్లు.

https://youtu.be/h1FC_P8fLsk

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -