Monday, April 29, 2024
- Advertisement -

ర‌ష్యాలో ఘోర విమాన ప్ర‌మాదం…41 మంది మృతి

- Advertisement -

ర‌ష్యాలో విమాన ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాద‌లో 42 మంది మృతిచెందారు. రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో సుమారు 78 మంది ఉన్నారు. ఆదివారం మాస్కో నుంచి ముర్‌మాన్స్‌కు వెళ్తున్న‌సుఖోయ్ సూప‌ర్‌జెట్ 100 టేకాఫ్ తీసుకున్న కాసేప‌టికే మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఆ విమానాన్ని అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ చేశారు.

టేకాఫ్‌ సమయంలో విమానం వెనుభాగం నేలను బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే విమానం వెనుక భాగంలో పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 41 మంది ప్రయాణకులు మృతిచెందారు. ఘటనా సమయంలో విమానంలో 78 మంది ఉండగా… మిగతా 37 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

వెనుకభాగంలో మంటలు చెలరేగిన ప్రయాణికులు అత్య‌వ‌స‌ర ద్వారం గుండా ప్రాణాలతో బయటపడ్డారు. 41 మంది మృతిచెందగా.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. టేకాఫ్ తీసుకున్న‌త‌ర్వాత విమానంపై పిడుగు ప‌డినట్లు కొంద‌రు ప్ర‌యాణికులు చెప్పారు. కానీ విమానయాన సంస్థ మాత్రం సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగా ల్యాండ్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -