Friday, May 3, 2024
- Advertisement -

మొబైల్ లో సౌండ్ ఎక్కువగా పెట్టాడు అని చంపేశారు

- Advertisement -

ఇలాంటి సంఘటనలు చూసి ఎలా స్పందించాలో కూడా అర్ధం కాని పరిస్థితి, అగ్ర కులాల మూర్ఖత్వం , అహంకారం ఎంతగా ఈ దేశం లో ఇంకా రాజ్యం ఎలుతోందో అనే వివరాలు ఇంకా కనిపిస్తున్నాయి. ఒక గిరిజన యువకుడు మొబైల్ లో సౌండ్ ఎక్కువగా పెట్టుకుని పాటలు వింటున్నాడు ఇండోర్ కి చెందిన ఆ యువకుడిని కొందరు అగ్రవర్ణం యువకులు శబ్దం తగ్గించమన్నారు దానికి అతను పొగరుగా సమాధానం చెప్పాడు. 

దాంతో కోపం వచ్చిన ఆ యువకులు అక్కడ నుంచి వెళ్లి మరి కొంత మంది వారి కులం వారిని తెచ్చుకుని మరీ అతన్ని తీవ్రంగా కాళ్ళతో , రాడ్ లతో కొట్టి చంపేసారు.కోన ఊపిరితో ఉన్న అతన్ని సజీవంగా దహనం చేసేసిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయం జరిగింది ఆగస్ట్ లో కాగా ఆలస్యంగా వెలుగు చూసింది . మధ్య ప్రదేశ్ హై కోర్టు ఇన్నాళ్ళ తరవాత ఈ కేసు ని విచారణ కి తీసుకుంది. 

ఎస్పీ , మనవర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ లకి కోర్టు సమన్లు కూడా జారీ చేసింది. పోలీసుల అండ ఉండడం వల్లనే ఇప్పటి వరకూ ఈ విషయం బయటకి రాలేదు అని చెబుతున్నారు ఆ కులం కుర్రాళ్ళు. మృతుడి అన్నయ్య అబాన్ కి ఆలస్యం గా ఈ విషయం తెలిసి జాగృత్ దళిత్ ఆదివాసీ సంఘతన్ సహాయం తో హై కోర్టు లో పిటీషన్ దాఖలు చేసుకున్నాడు. 

అగ్రవర్ణ యువకులే తన తమ్ముడిని కాల్చి చంపేసారు అని కేవలం ఫోన్ లో సౌండ్ తగ్గించనందుకు గత స్వతంత్ర దినోత్సవం రోజున వారు ఈ దారుణానికి ఒడిగట్టారు అని అతను చెప్పుకొచ్చాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -