Tuesday, April 23, 2024
- Advertisement -

మొబైల్ గేమ్స్ లో.. ఇండియా టాప్ !

- Advertisement -

నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితం స్మార్ట్ ఫోన్ల చుట్టే తిరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిద్ర లేచింది మొదలుకొని పడుకునే వరకు.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరు స్మార్ట్ ఫోన్ తోనే ఎక్కువ సమయం గగుతుపున్నారు. వినోదం కోసమైనా, ఇతరత్రా సమాచారం కోసమైనా స్మార్ట్ స్మార్ట్ ఫోనే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది మొబైల్ కు బానిసలు గా మారుతున్నారు. ముఖ్యంగా మొబైల్ కు బానిసలుగా మారుతున్న వారిలో చిన్న పిల్లలే అధికంగా ఉన్నారు.

ఇక మొబైల్ లోని ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డ కొందరు కొన్ని గేమ్స్ కు బానిసలుగా మారుతున్నారు. ముఖ్యంగా పబ్జీ, గరెనా ఫ్రీ ఫైర్ , కాల్ ఆఫ్ డ్యూటీ వంటి మొబైల్ గేమ్స్ కు అలవాటు పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది జూన్ నాటికి ఎక్కువ మంది ఆడుతున్న మొబైల్ గేమ్ గా సబ్ వే సర్ఫర్ నిలిచింది. సెన్సార్ టవర్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం.. 26 మిలియన్ డౌన్ లోడ్స్ ను సబ్ వే సర్ఫర్ కలిగి ఉందట.

అయితే సబ్ వే సర్ఫర్ మొత్తం డౌన్ లోడ్ శాతం 14.7 % అయితే అందులో 10.2 ఒక్క ఇండియా లోనే డౌన్ లోడ్స్ ను కలిగి ఉండడం గమనార్హం. అంటే దాదాపుగా 96% సబ్ వే సర్ఫర్ గేమ్ ఇండియాలోనే ఆడుతున్నారు. ఇక ఆ తరువాతి స్థానంలో గరెనా ఫ్రీ ఫైర్ 24.7 మిలియన్ డౌన్ లోడ్స్ ను కలిగి ఉంది. ఇక గ్లోబల్ మొబైల్ గేమ్స్ డౌన్ లోడింగ్స్ లో 2022 జూన్ నాటికి అటు యాప్ స్టోర్ ఇటు ప్లే స్టోర్ రెండిట్లో కలిపి 4.6 బిలియన్ డౌన్ లోడ్స్ ను కలిగి ఉందట. ఇక ప్రపంచం మొత్తంలో మొబైల్ గేమ్స్ ఎక్కువగా ఆడుతున్న దేశాల జాబితాలో 18.4 శాతంతో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత 9 శాతంతో అమెరికా రెండవ స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి

ప్లాస్టిక్ కు చెక్.. సరికొత్త రోబో టెక్నాలజీ.

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెంచే అద్బుతమైన టిప్స్ !

కృత్రిమ మానవులు వచ్చేస్తున్నారోచ్ ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -