Monday, April 29, 2024
- Advertisement -

చెమట దుర్వాసన వస్తుందా..అయితే!

- Advertisement -

ఎండాకాలం మొదలైంది. ఈసారి ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తుండగా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఉక్కపోతగా మారి చెమటలు వస్తుంటాయి. చెమట అనేది చర్మంపై అని భాగాల్లోనూ ఏర్పడుతుంది. అయితే ఇది కొంతమందిలో ఎక్కువ దుర్వాసన రావడానికి కారణం అవుతుంది.

అయితే కొన్ని ప్రదేశాల్లో చెమట సమస్య ఎక్కువగా ఉంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి శారీరక శ్రమ లేకపోయినప్పటికి వారిలో ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. అరచేతులు, అరికాళ్ళలో ఎక్కువగా చెమట రావడం ప్రమాదకర ఆరోగ్య సమస్యకు సంకేతమని చెబుతున్నారు.

ఈ రెండు చోట్ల చెమట వస్తే లివర్ ప్రమాదస్థితిలో ఉందనడానికి సింబల్ అని చెబుతున్నారు. లివర్ పై కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, లివర్ పనితీరు మందగించినప్పుడు చేతులు,అరికాళ్లలో చెమట ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి వైద్యుడిని సంప్రదించి, కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

చెమట సమస్యను ఇంట్లోని వస్తువల ద్వారా అధిగమించవచ్చు. కొద్దిగా నిమ్మరసం తీసుకొని దానిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కలపాలి. దీనిని చెమట ఎక్కువగా ఏర్పడే ప్రదేశాలలో అప్లై చేసి పదినిమిషాల ద్వారా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చెమట సమస్య తగ్గుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను గోరు వెచ్చని నీటిలో కరిగించి చెమట వచ్చే ప్రదేశాలలో రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల అక్కడ బ్యాక్టీరియా చనిపోయి దుర్వాసన రాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -