Thursday, May 9, 2024
- Advertisement -

ఈడీ ముందు హ‌జ‌ర‌యిన ఆంధ్రా మాల్యా..

- Advertisement -

వేల కోట్ల రుణాలు కొల్లగొట్టి బ్యాంకులకు టోకరా వేసిన కేసులో టీడీపీ రాజ్యసభ ఎంపీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు ఆంధ్రా విజ‌య్ మాల్లా అయిన సుజ‌నా చౌద‌రి చెన్నైలోని ఈడీ ముందు హ‌జ‌ర‌య్యారు. బ్యాంకులకూ రూ.5700 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఆయనను ఈడీ అధికారులు దాదాపు ఐదు గంటల పాటు విచారించారు.

బ్యాంకుల నుంచి రుణాల ద్వారా సేకరించిన మొత్తాలను దారిమళ్లించిన వైనంపై ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించినట్టు సమాచారం. డొల్ల కంపెనీలపైనా ఈడీ అధికారులు పలు కోణాల్లో సుజనాను ప్రశ్నించినట్టు తెలిసింది. బ్యాంకులకు ఆరువేల కోట్ల రూపాయలు బాకీపడి, వాటిని తీర్చడం లేదని సుజనా చౌదరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సోదాల అనంతరం తమ ఎదుట హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.

ఈ స‌మ‌న్ల‌ను ర‌ద్దు చేయాల‌ని ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించిన సుజ‌నాకు షాక్ ఇచ్చింది. మూడును ఈడీ ముందు హాజ‌రు కావాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. దానిలో భాగ‌వ‌గానే ఈ రోజు ఈడీ ముందు హాజ‌ర‌య్యారు ఆంధ్రా మాల్యా. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా చౌదరి కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి మొత్తం 126 డొల్ల కంపెనీలు సృష్టించి.. బ్యాంకుల నుంచి ఏకంగా రూ. 7500 కోట్లు కొల్లగొట్టారని ఈడీ వెల్లడించిన సంగ‌తి తెలిసిందే.చెన్నైలోని ఈడీ కార్యాలయంలో విచారణ చేపట్టిన అధికారులు ఆయన్ను పలు అంశాలపై దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -