Thursday, May 9, 2024
- Advertisement -

టీడీపీ రౌడీఇజం… ప్ర‌జాస్వామ్యానికి చెప్పుదెబ్బ‌

- Advertisement -
TDP Vs YSRCP: Proddatur Municipal Chairman Elections

ప‌ట్ట‌ప‌గ‌లే ప్రాజ‌స్వామ్యం కూనీ అయ్యింది.. అధికార పార్టీ నాయ‌కుల దౌర్జ‌న్యాల‌కు అడ్డూ అదుపులేకుండా పోయింది. పోలీసు బ‌ల‌గాలు ఉన్నా చూస్తు ఉరుకున్న వైనం.  ప‌చ్పర్టీనాయ‌కులు గుండాల్లాగ వ్య‌వ‌హ‌రిస్తున్నా క‌నీసం త‌మ డ్యూటీ చేయ‌లేని స్తితిలో పోలీసులు.

ద‌ర్మాన్ని  కాపాడాల్సిన క‌లెక్ట‌ర్‌,పోలీసులు,అధికార‌లు ప‌ట్ట‌ప‌గ‌లే ప్ర‌జాస్వామ్యాన్ని కూనీ చేశారు. ఇది ఎక్క‌డో కాదండి  క‌డ‌ప‌జిల్లా ప్రాద్దుటూరు. ఈవ్య‌వ‌హార‌మంతా ఏంది అనుకుంటున్నారా..అదంగా మున్సిప‌ల్ ఛైర్మెన్ ఎన్నికే….

 ప్రొద్దుటూరు మున్సిప‌ల్ ఛైర్మెన్ ఎంప‌కి  మొద‌టి రోజు టీడీపీ అభ్యర్థి ఆసం రఘురామిరెడ్డి ఓటమి ఖాయంగా కనిపించడంతో సమావేశం ప్రారంభం కాగానే టీడీపీ కౌన్సిలర్లు వీరంగం సృష్టించారు. కౌన్సిలర్లు కుర్చీలు – బెంచీలు విరగ్గొట్టారు.  ఎన్నిక జరగడానికి వీల్లేదంటూ గొడవ చేశారు.  ఎన్నికలను వాయిదా వేయకుంటే ఉరి వేసుకుంటానంటూ ఓ విద్యుత్ వైరును టీడీపీ కౌన్సిలర్ ఒకరు మెడకు చుట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆపై టీడీపీ – వైకాపా సభ్యులు నినాదాలు – ప్రతినినాదాలతో హోరెత్తించగా శాంతి భద్రతల దృష్ట్యా ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు

మ‌రుస‌టి రోజుకూడా వ్య‌వ‌హారం ర‌చ్చ‌ర‌చ్చ‌గామారింది. మ‌ల్లీ అదే సీన్‌. వీధిరైడీల్లా అధికార‌పార్టీ న‌య‌కులు వ్య‌వ‌హ‌రించారు. నిజానికి  ప్రతిపక్షానికి మున్సిపల్‌ ఛైర్మన్‌ని ఎంపిక చేసుకునేంత బలం వుంది.కానీ ఛైర్మెన్ ప‌ద‌విని ద‌క్క‌కుండా అధికార‌టీడీపీ నాయ‌కులు ఆడిన నాట‌కం అంతాఇంతా కాదు. పైగా అధిక‌రంలో ఉన్నాపార్టీ.  మున్సిప‌ల్ ఛైర్మెన్ ప‌ద‌విని ద‌క్కించుకోక‌పోతే ప‌రువుపోతే  అధికార పార్టీ దృష్టిలో ప‌రువుపోతుంది కాబ‌ట్టి  ఏంచేయాలో తెలియ‌క చివ‌రికిబరితెగించి  గుండాయిజాన్ని ప్ర‌ద‌ర్శించి నానా ర‌భ‌స చేశారు. .నేడుకూడా అదే ప‌రిస్థితి. ఎన్న‌క జ‌రిగితే  ఓటమి పాలైతే త‌లెత్తుకుని తిర‌గ‌లేని ప‌రిస్థితి. ఇంకే చేస్తారు…చివ‌ర‌కి మిగిలింది గుండాయిజ‌మే కాబ‌ట్టి విధ్వంసం సృష్టిస్తామంటూ …. తెలుగు త‌మ్ముల్లు చెల‌రేగిపోయారు.గ‌ల్లీల‌ల్లో  వీధిరౌడీల‌లాగా ప్ర‌వ‌ర్తించారు. పార్టీ ప‌రువు తీశారు.

ఏదైనా అన్యాయం  జ‌రిగితే దాన్ని కాపాడాల్సిన బాధ్య‌తం పోలీసుల‌ది. ఇంత‌కీ  ఈ ఎపీసోడ్‌లో పోలీసులు ఏంచేస్తున్నార‌నేగా ఆలోచించేది  ఏంచేస్తారు అక్క‌డ జ‌రుగుతున్న తంతంగ‌మంత‌చూసి ఎంజాయ్ చేస్తున్నారు.    పెద్ద సంఖ్యలో బలగాల్ని మాత్రం మోహరించారు. ఎందుకు, అధికార పార్టీ నేతల ఆగడాలు యధేచ్ఛగా కొనసాగడం కోసం. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షం ఏం చేయగలుగుతుంది.? ఏమీ చేయలేదు. అందుకే, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ‘వ్యవస్థలు నాశనం చేసేశారు..’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. అసలిదేం ప్రజాస్వామ్యమంటూ మండిపడ్డారు. పోలీసులు మాత్రం, షరామామూలుగానే చోద్యం చూశారు.

ఎక్క‌డైనా  విపక్షాలు ఆందోళన చేయడం మామూలే. కానీ  అదే అధికారపక్షం రోడ్డెక్కి  రౌడీయిజం ప్రదర్శిస్తే…దాన్ని ఏమనాలి.దానికి అధికార‌లు,పోలీస‌లుకూడా వంత‌పాడితే  ఇక ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించేది ఎవ‌రు .

Also Read

  1. జ‌గ‌నే సీఎం…. ఇది పిక్స్‌
  2. కాన్ఫిడెన్సా …. ఓవ‌ర్ కాన్ఫిడెన్సా
  3. కొత్త ఇంటిపై బాబును ఏకేసిన పైర్ బ్రాండ్ రోజా!
  4. సాక్షి చదవొద్దు అని చెబుతాడు కానీ బాబు మాత్రం చదువుతాడు 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -