Friday, April 26, 2024
- Advertisement -

అనుకున్న విధంగా తెలంగాణా లో కేసులు ఈరోజు..!

- Advertisement -

తెలంగాణ లో గడచిన 24 గంటల్లో 2,157 మందికి వైరస్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. గత వారం రోజులతో పోలిస్తే ఈ రోజు కొంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనా.. అది కేవలం నిర్ధారణ పరీక్షలు తగ్గటమే కారణమన్న విషయాన్ని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

గడచిన వారం రోజులుగా నిత్యం 90 వేల నుంచి లక్షకు పైగా టెస్టులు చేస్తుండగా మంగళవారం ఉగాది కావడం వల్ల పరీక్షల సంఖ్య 72 వేలకే పరిమితం అయ్యింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 1,12,53,374కి చేరింది.

తాజాగా వచ్చిన పాజిటివ్​ వచ్చిన కేసులతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,34,738 మంది కొవిడ్​ బారిన పడ్డారని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా మరో 821 మంది కోలుకోగా… ఇప్పటి వరకు బయటపడిన వారి సంఖ్య 3,07,499కి చేరింది. కొవిడ్​ కోరల్లో చిక్కుకొని 8 మంది మరణించగా… మొత్తం మృతుల సంఖ్య 1780కి చేరింది. రాష్ట్రంలో 25,459 యాక్టివ్ కేసులున్నాయి. అందులో 16,892 మంది హోంఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారు.

శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగం.. రాశీ ఫలాలు!

ఉగ్రరూపంగా బాలయ్య ‘అఖండ’ టీజర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -