Tuesday, May 7, 2024
- Advertisement -

శభాష్ ఎంపిలు

- Advertisement -

పార్లమెంటులో తెలంగాణ ఎంపిలు పరువు నిలుపుకున్నారు. పార్లమెంటు సమావేశాలకు ఇలా వెళ‌్లాం.. అలా వచ్చాం అని కాకుండా కొందరు ఎంపిలు పలు చర్చల్లోనూ.. వివిధ ప్రశ్నలు అడగడంలోనూ శభాష్ అనిపించుకున్నారు. గడచిన రెండేళ్లలో పార్లమెంటు సభ్యుల పనితీరుపై పిఆర్‌ఎస్ ఇండియా సంస్ధ అద్యయనం చేసి ఓ నివేదిక రూపొందించింది.

తెలంగాణలోని 17 మంది ఎంపిల్లో దత్తాత్రేయ మంత్రి. ఇక మిగిలిన 16 మంది ఎంపిలు ఫరవాలేదనిపించారు. టిఆర్ఎస్ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ ఈ రెండేళ్లలోనూ 56 చర్చల్లో పాల్గొని తెలంగాణ ఎంపిల్లోనే ఫస్టు వచ్చారు. లోక్‌స‌భలో ప్రశ్నలు వేయడంలో అసదుద్దీన్ ఒవైసీ ముందున్నారు. ఈయన ఈ రెండేళ్లలోనూ ఏకంగా 414 ప్రశ్నలు వేసి మొదటి స్ధానంలో ఉన్నారు. ఇక కొత్త ఎంపి పసునూరి దయాకర్ ఒక్క ప్రశ్న కూడా వేయలేదు.

ప్రశ్నలు సంధించడంలో కూడా వినోద్ కుమార్ శభాష్ అనిపించుకున్నారు. అసదుద్దీన్ తర్వాత 282 ప్రశ్నలు సంధించి వినోద్ కుమార్ రెండో స్ధానంలో ఉన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ మంత్రి కాక ముందు 12 ప్రశ్నలు వేశారు. తెలంగాణ ఎంపిల హాజరు కూడా 85 శాతం ఉంది. ఇది కూడా ఓ విధంగా రికార్డే. మిగిలిన ఎంపిలు కూడా తమ మేరకు ఫరవాలేదనిపించారు. నిజామాబాద్ ఎంపి కవిత 29 చర్చల్లో పాల్గొనడం విశేషం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -