Friday, April 19, 2024
- Advertisement -

నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు..!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశిస్తాడని, అప్పటి నుంచి పుణ్యఘడియలు ప్రారంభమవు తాయని పండితులు తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కర్నూలులోని సంకల్‌భాగ్‌ ఘాట్‌లో ప్రత్యేక పూజలతో పుష్కరాలను ప్రారంభించనున్నారు. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఐదువేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనుంది. అలాగే, ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు.

తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం 23 ఘాట్లను నిర్మించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పుష్కరాలకు అనుమతి ఇచ్చింది. కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పుష్కరఘాట్ల వరకూ 43 బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. తుంగభద్ర నదిలో ప్రస్తుతం 5 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. 

నీటి సమస్య లేకుండా ఉండేందుకు తుంగభద్ర డ్యాం నుంచి అదనంగా రోజుకు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. కాగా, 2008లో వచ్చిన తుంగభద్ర పుష్కరాల్లో 50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, వృద్దులు పుష్కరాలకు రావొద్దని సూచించింది.

కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ మార్క్ ప్లాన్..!

దేశంలోనే జ‌గ‌నన్న బెస్ట్ సీఎం..!

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

నమ్మకం కోల్పోయాక కాళ్ళబేరానికి వస్తే ఏం లాభం.?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -